Parliament updates: రాష్ట్రపతిని సైతం అవమానించేలా మాట్లాడుతున్నారు.. ద్వేషాన్ని ప్రదర్శించారు: లోక్ సభలో మోదీ

పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తన ప్రసంగంతో మనలో స్ఫూర్తిని నింపారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ఇవాళ లోక్ సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ద్వారా ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందని చెప్పారు. దేశంలోని మహిళలకు ముర్ము స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కొందరు నేతలు రాష్ట్రపతిని సైతం అవమానించేలా మాట్లాడుతున్నారని చెప్పారు.

Parliament updates: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంతో మనలో స్ఫూర్తిని నింపారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ఇవాళ లోక్ సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ద్వారా ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందని చెప్పారు. దేశంలోని మహిళలకు ముర్ము స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కొందరు నేతలు రాష్ట్రపతిని సైతం అవమానించేలా మాట్లాడుతున్నారని చెప్పారు.

“పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం కొనసాగుతున్న సమయంలో కొందరు సభ్యులు సభకు రాలేదు. ఓ పెద్ద నాయకుడు కూడా రాష్ట్రపతిని అవమానించేలా ప్రవర్తించారు. ఎస్టీలపై ద్వేషాన్ని ప్రదర్శించారు. కొందరు నేతల విద్వేషం వారి మాటల ద్వారా వెల్లడైంది. జీ20కి భారత్ నాయకత్వం వహిస్తుండడం కొందరికి బాధకలిగిస్తున్నట్లుంది. దేశంలోని 140 కోట్ల మందికి లేని బాధ కొందరికి మాత్రం ఉంది. అటువంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ప్రపంచానికి మన దేశం ఓ ఆశా దీపంలా మారింది. కొన్ని దేశాలను కరోనా గట్టిగా దెబ్బతీసింది. కరోనా సంక్షోభం నుంచి భారత్ పూర్తిగా బయటపడింది. 100 ఏళ్లకు ఓ సారి కరోనా వంటి మహమ్మారి బారిన పడాల్సి వస్తుంది. మరోవైపు, ప్రపంచంలో యుద్ధ వాతావరణం వంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులనూ మన దేశం సమర్థంగా ఎదుర్కొంది.

గత యూపీఏ ప్రభుత్వ పాలనలో దేశంలో ఉగ్రవాదం, అవినీతి విపరీతంగా ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. దేశంలో ఇప్పుడు స్థిరంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది. విపక్ష నేతలు తొమ్మిదేళ్లుగా ఆలోచన ఏమీ చేయకుండా, కేవలం ఆరోపణలు చేయడంపైనే దృష్టిపెట్టారు” అని మోదీ వ్యాఖ్యానించారు.

కాగా, లోక్ సభ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేశారు.

PM Modi Blue Jacket: ప్రధాని మోదీ ధరించిన బ్లూ జాకెట్‭ వెనుక గ్రీన్ సందేశం

ట్రెండింగ్ వార్తలు