Dangerous Stunt : వీడి సోషల్ మీడియా పిచ్చి పాడుకాను.. నేషనల్ హైవేపై ఆ పని చేసి అరెస్ట్ అయ్యాడు, వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఓ యువకుడు చేసిన పని.. అతడిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది. రాజస్తాన్ లోని నయా గ్రామానికి చెందిన నౌరత్ గుర్జార్(20) అనే యువకుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు.. నేషనల్ హైవేపై ఉండే డైరెక్షన్ బోర్డుకు వేలాడుతూ పుల్ అప్ లు చేశాడు.

Dangerous Stunt : వీడి సోషల్ మీడియా పిచ్చి పాడుకాను.. నేషనల్ హైవేపై ఆ పని చేసి అరెస్ట్ అయ్యాడు, వీడియో వైరల్

Dangerous Stunt : సోషల్ మీడియా.. కొందరి జీవితాలనే మార్చేసింది. ఓవర్ నైట్ లో సెలబ్రిటీలను చేసింది. వీడియోలు చేయడం సోషల్ మీడియాలో పెట్టడం, అంతే ఒక్కసారిగా పాపులర్ అయిపోవడం. పలువురి విషయంలో ఇదే జరిగింది.

అయితే, కొందరు ఈ సోషల్ మీడియా పిచ్చితో అడ్డంగా బుక్కవుతున్నారు. పిచ్చి పనులతో పాపులర్ అవడం మాట అటుంచితే.. జైలుపాలు అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియా పిచ్చితో కష్టాల్లో పడ్డాడు. అతడు చేసిన పనికి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

Also Read..Wedding Photoshoot : కెమెరామెన్‌ దిమ్మతిరిగిపోయింది.. ఫొటోలకు ఫోజులివ్వమంటే.. ముద్దులతో రెచ్చిపోయిన జంట .. వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ఓ యువకుడు చేసిన పని.. అతడిని పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెళ్లింది. రాజస్తాన్ లోని నయా గ్రామానికి చెందిన నౌరత్ గుర్జార్(20) అనే యువకుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు.. నేషనల్ హైవేపై ఉండే డైరెక్షన్ బోర్డుకు వేలాడుతూ పుల్ అప్ లు చేశాడు.

ఇదంతా వీడియో తీయించాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అంతే, వీడియో వైరల్ అయ్యింది. అయితే, అతడు అనుకున్నది ఒకటైతే, అక్కడ జరిగింది మరొకటి. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. వారు సీరియస్ అయ్యారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేశావంటూ పోలీసులు కేసు నమోదు చేసి నౌరత్ ను అరెస్ట్ చేశారు.

Also Read..Gunmen Kills 7 : బాబోయ్.. నవ్వారని, ఏడుగురిని కాల్చి చంపేశారు.. వీడియో వైరల్

అజ్మీర్ నేషనల్ హైవే-8 నసీరాబాద్ దగ్గర సైన్ బోర్డు ఏర్పాటు చేసి ఉంది. ఆ బోర్డు పట్టుకుని యువకుడు స్టంట్స్ చేశాడు. ఓవైపు రోడ్డు మీదుగా పెద్ద పెద్ద వాహనాలు వెళ్తున్నాయి. మరోవైపు ఇతడు చాలా ఎత్తులో ఉన్న బోర్డు పట్టుకుని స్టంట్స్ చేశాడు. ఇదంతా వీడియో తీయించాడు. అతడు అనుకున్నట్టే వీడియో అయితే తెగ వైరల్ అయ్యింది. అయితే, ఫాలోవర్స్ పెరిగారో లేదో తెలియదు కానీ.. ఆ లోపు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

Also Read..Attacked By Cow : బాబోయ్.. కొమ్ములతో యువతిని ఎత్తిపడేసిన ఆవు, తలకు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

ఆ యువకుడి సరదా తీర్చారు. వీడియో ఆధారంగా పోలీసులు యువకుడిని గుర్తించారు. అతడిని అజర్మీ నయా గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ప్రాణాలను రిస్క్ లో పెట్టి ప్రమాదకర స్టంట్స్ చేశావంటూ అతడిపై సీరియస్ అయ్యారు. అంతేకాదు, అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. పాపం, అనుకున్నది ఒకటి అయినది మరొకటి అంటూ ఏడుపు ఒక్కటే తక్కువైంది ఆ యువకుడికి. యువకుడు చాలా రిస్క్ చేశాడని, ఏ మాత్రం తేడా వచ్చినా అంత ఎత్తున నుంచి కిందకు పడి ఉంటే అతడి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు అన్నారు. సోషల్ మీడియా పిచ్చితో ఇలాంటి ప్రమాదకర పనులు చేయొద్దని హెచ్చరించారు.