Minor girl case: బాలికను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన నిందితుడిని అదే ప్రాంతం నుంచి కొడుతూ తీసుకెళ్లిన పోలీసులు

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ బాలికను నిందితుడు ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన రోడ్డుపై నుంచే పోలీసులు అతడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అతడి చేతికి సంకెళ్లు వేసి, చెవులను చేతులతో పట్టుకునేలా చేసి పోలీసులు నడిపించారు.

Minor girl case: బాలికను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన నిందితుడిని అదే ప్రాంతం నుంచి కొడుతూ తీసుకెళ్లిన పోలీసులు

minor girl

Minor girl case: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ లో 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ బాలికను నిందితుడు ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన రోడ్డుపై నుంచే పోలీసులు అతడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అతడి చేతికి సంకెళ్లు వేసి, చెవులను చేతులతో పట్టుకునేలా చేసి పోలీసులు నడిపించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోను రాయ్‌పూర్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి దాడి చేసి, ఒక చేతితో ఆయుధాన్ని, మరో చేతిలో ఆ అమ్మాయి జుట్టును పట్టుకుని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. గుఢియారీ ప్రాంతంలో దుకాణం నడుపుతున్న ఓంకార్ తివారీ తన వద్ద ఓ 16 ఏళ్ల బాలిక పనిచేస్తోంది.

పలు కారణాల రీత్యా ఉద్యోగం మానేస్తానని ఆ బాలిక చెప్పింది. ఆమె ఉద్యోగం మానేయడానికి అతడు ఒప్పుకోలేదు. అంతేగాక, గత శనివారం సాయంత్రం ఆ బాలిక ఇంటికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఆ బాలికతో పాటు ఆమె తల్లి అతడిని వెళ్లిపోమన్నారు. దీంతో అతడు బాలికపై దాడి చేసి, అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. అతడిపై కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Man Attacked Girl : పెళ్లికి నిరాకరించడంతో.. 16 ఏళ్ల బాలికపై దాడి చేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన 47 ఏళ్ల వ్యక్తి