New Son in law Procession: కొత్త అల్లుడ్ని గాడిదపై ఊరేగించిన గ్రామస్తులు.. వీడియో వైరల్

కొత్త అల్లుడు ఇంటికి వస్తే.. అత్తామామలు, బంధువులు ఎంతో మర్యాదగా చూసుకుంటారు. అల్లుడికి పలురకాల వంటకాలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. సరదాగా గ్రామంలో తిప్పుతూ ఊరి విశేషాలను వివరిస్తారు. కానీ మహారాష్ట్రంలోని బీడ్ జిల్లా విడా గ్రామంలో మాత్రం కొత్త అల్లుడ్ని గాడిదపై ఊరేగించారు.

New Son in law Procession: కొత్త అల్లుడ్ని గాడిదపై ఊరేగించిన గ్రామస్తులు.. వీడియో వైరల్

New Son in law Procession

New Son in law Procession: కొత్త అల్లుడు ఇంటికి వస్తే.. అత్తామామలు, బంధువులు ఎంతో మర్యాదగా చూసుకుంటారు. అల్లుడికి పలురకాల వంటకాలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తారు. సరదాగా గ్రామంలో తిప్పుతూ ఊరి విశేషాలను వివరిస్తారు. ఇది మనకు తెలిసిన సంప్రదాయం. కానీ, మహారాష్ట్రలోని బీడ్ జిల్లా విడా గ్రామంలో వింత ఆచారం ఉంది. హోలీ తర్వాత కొత్త అల్లుడిని గాడిదపై గ్రామం మొత్తం ఊరేగించడం వారి ఆనవాయితి. ఈ సంప్రదాయం గత 82ఏళ్లుగా పాటిస్తున్నారట. ఈ సంప్రదాయంలో కులమతాలకు తావులేదు. గ్రామంలో ఎవరింటికి కొత్తగా అల్లుడు వస్తే అతన్ని గ్రామస్తులంతా కలిసి గ్రామంలో గాడిదపై ఊరేగించి తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

Procession On JCB: బుల్డోజర్‌పై నూతన జంట ఊరేగింపు .. చూసేందుకు తరలివచ్చిన ప్రజలు.. వీడియో వైరల్

గ్రామస్తుల కథనం ప్రకారం.. కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఠాకూర్ ఆనంద్ దేశ్‌ముఖ్ కుటుంబం నివసించేది. ఆ ఇంటికి వచ్చిన అల్లుడు హోలీకి రంగులు వేయడానికి నిరాకరించాడట. అప్పుడు అతన్ని మామ రంగులు పూయించుకోవటానికి ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పూలతో అలంకరించిన గాడిదను తెప్పించి దానిపై అల్లుడ్ని కూర్చోబెట్టి, పాదరక్షలు, హారాలను ధరించి గ్రామంలో ఊరేగించారు. ఆ తరువాత అల్లుడ్నిగాడిదపైనే ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లి హారతి ఇచ్చి కొత్త బట్టలు, బంగారు ఉంగరం అందజేసి నోరు తీపి చేశారట. అప్పటి నుంచి గ్రామంలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.

 

 

హోలీ రాగానే గ్రామంలోకి కొత్తగా వచ్చిన అల్లుళ్లు ఫోన్లు స్విచ్ఆఫ్ చేసి గ్రామస్తులకు కనిపించకుండా వెళ్లిపోతారు. వారిలో ఒకరిని గుర్తించి గ్రామస్తులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈసారి గ్రామానికి కొత్త అల్లుడైన అవినాష్ కర్నేను గ్రామస్తులు పట్టుకొని గ్రామం మొత్తం గాడిదపై ఊరేగించారు. ఆ తరువాత అత్తామామలు అల్లుడికి కొత్త బట్టలు, బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. కొత్త అల్లుడ్ని గాడిదపై ఊరేగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోనుచూసిన నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.