PV Sindhu : అప్పుడు, ఇప్పుడు అదే.. సింధు కులమేంటి? అంటూ గూగుల్ సెర్చ్

పీవీ సింధు కాంస్య పతకం గెలవడంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సింధు ఎక్కడ పుట్టారు. ఎంతవరకు చదువుకున్నారు అని సెర్చ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సింధు కులం గురించి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.

PV Sindhu : అప్పుడు, ఇప్పుడు అదే.. సింధు కులమేంటి? అంటూ గూగుల్ సెర్చ్

Pv Sindhu (2)

PV Sindhu : ఎవరైనా దేశం గర్వించదగ్గ పని చేస్తే.. వారి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. వారి వివరాలు తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. ఎక్కడ పుట్టారు?. ఇంతకూ ముందు ఎలాంటి విజయాలు సాధించారు?. ఎంతవరకు చదువుకున్నారు వంటివి సెర్చ్ చేస్తుంటారు. కొందరు మాత్రం వారి కులం ఏంటో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పుడు పీవీ సింధు విషయంలో కూడా ఇదే జరిగింది.

ఆమె టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలవడంతో మరోసారి హైలెట్ అయ్యారు. దీంతో చాలామంది నెటిజన్లు ఆమె గురించి తెలుసుకోవడం కోసం గూగుల్ సెర్చ్ ను ఆశ్రయిస్తున్నారు. కొందరు ఆమె కుటుంబం గురించి సెర్చ్ చేస్తుంటే.. మరికొందరు ఆమె ఎడ్యుకేషన్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంకొందరు సింధు ఇల్లు గురించి సెర్చ్ చేస్తున్నారు. అయితే వీరిలో కొద్దీ మంది ఆమె కులం ఏంటని సెర్చ్ చేస్తున్నారు.

PV SINDHU CASTE అంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సింధు వివరాల కోసం గూగుల్ లో వెతికారు. పీవీ సింధు కాస్ట్ పేరుతో ఎక్కువ మంది శోధించారు. గతంలోనూ పీవీ సింధు రజత పతకం సాధించిన సందర్భంగా ఆమె కాస్ట్ ను గూగుల్ లో సెర్చ చేశారు. పీవీ సింధు, పీవీ సింధు విన్స్, పీవీ సింధు కాస్ట్ వెతికారు.

 

v