Rajamouli : రిచెస్ట్ డైరెక్టర్స్ లో రాజమౌళికి స్థానం..

రాజమౌళి బాహుబలి సినిమాతోనే దేశంలోనే టాప్ డైరెక్టర్స్ లో నిలిచాడు. ఇక RRR సినిమాతో ప్రపంచమంతా పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం డైరెక్టర్ గా బాగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు రాజమౌళి......................

Rajamouli : రిచెస్ట్ డైరెక్టర్స్ లో రాజమౌళికి స్థానం..

Rajamouli gets placed in top richest directors list in India

Rajamouli :  రాజమౌళి బాహుబలి సినిమాతోనే దేశంలోనే టాప్ డైరెక్టర్స్ లో నిలిచాడు. ఇక RRR సినిమాతో ప్రపంచమంతా పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం డైరెక్టర్ గా బాగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు రాజమౌళి. కానీ ఆస్తులు మాత్రం తక్కువే ఉన్నాయట. తక్కువే ఉన్నా ఇండియాలోనే టాప్ రిచెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు రాజమౌళి. తాజాగా GQ ఇండియా టాప్ రిచెస్ట్ డైరెక్టర్స్ ఇండియా లిస్ట్ ని విడుదల చేసింది.

ఇండియాలోనే టాప్ రిచెస్ట్ డైరెక్టర్స్ లో రాజమౌళి ఏడో స్థానంలో నిలవడం విశేషం. వాళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం టాప్ 1గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ 1640 కోట్లతో నిలిచాడు. ఇక రెండో స్థానంలో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ 1100 కోట్లతో నిలిచారు. మూడో స్థానంలో సంజయ్ లీల భన్సాలీ 940 కోట్లతో నిలిచారు. నాలుగో స్థానంలో బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ 720 కోట్లతో నిలిచాడు. ఐదో స్థానంలో బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ 300 కోట్లతో నిలిచాడు. ఆరో స్థానంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ 280 కోట్లతో ఉన్నాడు. ఏడో స్థానంలో రాజమౌళి 158 కోట్లతో నిలిచారు. ఎనిమిదో స్థానంలో జోయా అక్తర్ 76 కోట్లతో నిలిచింది.

Chandrabose : ‘నాటునాటు’కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాకతో.. గేయ రచయిత చంద్రబోస్‌ను సన్మానించిన మెగాస్టార్..

అయితే రాజమౌళి కంటే ముందున్న వాళ్ళు దర్శకులుగానే కాకుండా నిర్మాతలుగా, వివిధ ఎండార్స్మెంట్ రూపంలో, వివిధ పెట్టుబడుల ద్వారా కూడా సంపాదించారు. రాజమౌళి కేవలం సినిమాల ద్వారా మాత్రమే సంపాదించారు. రాజమౌళి కూడా ఎండార్స్మెంట్స్, పెట్టుబడులకు ఓకే చెప్తే ప్రస్తుతం ఆయనకి ఉన్న పాపులారిటికి ఆ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్స్ అందర్నీ దాటేస్తాడని రాజమౌళి అభిమానులు అంటున్నారు.

View this post on Instagram

A post shared by GQ India (@gqindia)