Secret river In Antarctica : అంటార్కిటికాలో రహస్య నదిని కనుగొన్న శాస్త్రవేత్తలు .. 460 కి.మీ ప్రవహిస్తోన్న నది గురించి పరిశోధకుల ఆందోళన

అంటార్కిటికా ఖండంలో రహస్య నదిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మంచు పలకల కింద థేమ్స్ నదికంటే పెద్దదైన 460 కి.మీ ప్రవహిస్తోన్న నది గురించి పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Secret river In Antarctica : అంటార్కిటికాలో రహస్య నదిని కనుగొన్న శాస్త్రవేత్తలు .. 460 కి.మీ ప్రవహిస్తోన్న నది గురించి పరిశోధకుల ఆందోళన

Secret river In Antarctica

Secret river In Antarctica : అంటార్కిటికా..ఈ ఖండం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మంచు..ఎటుచూసిన కనుచూపు మేర మంచు. కాని ఇప్పుడు ఈ మంచుఖండం అంతుచిక్కని రహస్యాలకు నిలయంగా మారింది.. ఇక్కడ కనుగొన్న అదృశ్య నది సైంటిస్టులనే కలవర పెడుతోంది. అసలు అంటార్కిటికలో అదృశ్య నది ఏంటి..? దీని వల్ల రాబోయే రోజుల్లో ఎదురయ్యే విపత్తులు ఏంటనేది అంతుచిక్కడం లేదు..

అంటార్కిటికా.. మానవాళికి దూరంగా హిమానీ నదాలు, మంచు పర్వతాలతో నిండిపోయిన మంచు ఖండం.. ఇక్కడి పర్యావరణ, జీవావరణ వ్యవస్థ గురించి లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. చుట్టూ ఉన్న మంచుతో నిండిపోయిన సముద్రం కూడా అద్భుతమైన జీవ రహస్యాలను తన గుండెల్లో దాచుకుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మంచుఖండంలో ఇటీవల శాస్త్రవేత్తలు ఓ అదృశ్య నదిని కనుగొన్నారు. గ్లోబల్ వార్మింగ్‌తో ఇప్పటికే మంచు వేగంగా కరిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోన్న ఈ సమయంలో.. ఈ సీక్రెట్ రివర్‌ జాడలు తెలియడం మరింత కలవరానికి గురిచేస్తోంది. అదృశ్య నది వల్ల రాబోయే రోజుల్లో ఎదురయ్యే విపత్తులు ఏమిటనే దానిపై విస్త్రత చర్చ జరుగుతోంది.

Mystery Machapuchare : కళ్లు చెదిరే అందం ఈ పర్వతం సొంతం.. అక్కడ అడుగు పెట్టానికి కూడా వీల్లేదంటున్న ఆ దేశ ప్రభుత్వం..కారణం అదేనా..?

యూకే, కెనడా, మలేషియా శాస్త్రవేత్తలు కలిసి ఏరియల్ సర్వే ద్వారా అంటార్కిటికాను పరిశోధించినప్పుడు ఈ అదృశ్య నది ఉన్న విషయం బయటపడింది. అంటార్కిటికాలోని మంచు పలకల కింద సుమారు 460 కిలోమీటర్లు ఇది ప్రవహిస్తోందని గుర్తించారు. గతంలో లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు చేసిన అధ్యయనం ద్వారా మంచుపలకల కింద పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయని ఇప్పటి వరకు అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సరస్సులే నదిగా మారి ఉంటాయని భావిస్తున్నారు. మంచు కరిగి నదిగా ఏర్పడొచ్చని అంచనా వేస్తున్నారు.

Mystery Mountain : మానవుడు ఇప్పటి వరకు అడుగు పెట్టని పర్వతం..! అందంగా కనిపించే ఈ పర్వతం వెనుకున్న రహస్యమేంటీ..?!!

అంటార్కిటికా మంచు పొరల కింద ఉన్న భూమితో రాపిడి వల్ల కాని.. పైన మంచు కరిగి పగుళ్ల ద్వారా నీరు కిందకు వెళ్లడం ద్వారా కాని ఈ నది ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మంచుపొరల కింద ఉన్న నదీ ప్రవాహం క్రమక్రమంగా పెరగడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నదిలోని వేడి నీళ్ల ప్రవాహం.. మంచు పలకలను కింద నుంచి వేగంగా కరిగించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. దీని వల్ల అంటార్కిటికలో అన్యూహ్యమైన మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్‌ వల్ల అంటార్కిటికాలో మంచు కరిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంటే.. ఇప్పుడు ఈ నది వల్ల ఆ ప్రభావం మరింత ఎక్కువయ్యే అకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశోధకులు.