చిన్నతనంలోనే రామాయణం, మహాభారతం వినేవాడిని : ఒబామా

  • Published By: sreehari ,Published On : November 17, 2020 / 01:59 PM IST
చిన్నతనంలోనే రామాయణం, మహాభారతం వినేవాడిని : ఒబామా

Obama Childhood Listening To Ramayana, Mahabharata : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియాతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనం నుంచే భారతదేశపు హిందూ పురాణ మహా కావ్యాలు, కథలపై మక్కువ ఉండేదంట.. చిన్నతనంలో విద్యా జీవితాన్ని ఇండోనేషియాలోనే గడిపారు.



అక్కడి కాలేజీలో భారతీయులతో స్నేహసంబంధాలతో హిందు కావ్యాలైన రామాయణ, మహాభారతం కథలపై ఆసక్తి పెరిగిందంట.. ఇండోనేషియాలో చదువుకున్న రోజుల్లో ఈ రెండు కావ్యాల కథలను ఎక్కువగా వినేవాడినని తాను రాసిన లేటెస్ట్ బుక్ ‘A Promised Land’లో చెప్పుకొచ్చారు ఒబామా.
https://10tv.in/brics-summit-from-today-pm-modi-chinese-president-xi-jinping-to-come-face-to-face-virtually-again/
ప్రపంచంలో ఆరో వంతు జనాభా కలిగిన భారతదేశంలో రెండు వేల విభిన్న జాతి సమూహాలు, ఏడు వందలకు పైగా భాషలు మాట్లాడే అత్యంత సువిశాలమైన భారతదేశం ఎంతో పరిపూర్ణమైనది’ అంటూ ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారు.



2010లో తాను అధ్యక్ష హోదాలో భారత్ పర్యటనకు రాక ముందు తానెప్పుడూ ఇండియాలో పర్యటించలేదని అన్నారు. కానీ, తన మనస్సులో మాత్రం భారతదేశానికి ప్రత్యేకమైన స్థానం ఉందని రాసుకొచ్చారు.

‘నా చిన్నతనంలో ఇండోనేషియాలో హిందు కావ్యాలు రామాయణ, మహాభారత కథలను వినడంతోనే ఎక్కువగా సమయం గడిపేవాడిని. బహుషా అది అక్కడి భిన్న సంస్కృతులపై ఆసక్తి కావొచ్చు.. లేదంటే.. తన కాలేజీ జీవితంలో భారతీయ స్నేహితులు ఉండేవారు.



అలా భారతీయ మహా కావ్యాలపై ఆసక్తిని పెరిగిఉండొచ్చు.. నాకు భారతీయ వంటకాల్లో పప్పు, కీమా ఎలా వండాలో కూడా భారతీయ స్నేహితులే నేర్పించారు. అదే నన్ను బాలీవుడ్ మూవీలపై ఆసక్తి పెరిగేలా చేసిందేమో’ అని ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు.

2008 ఎన్నికల ప్రచారం నుంచి తన పదవీకాలం ముగిసేనాటికి మొత్తం తన లైఫ్ జర్నీని A Promised Land పేరుతో పుక్తాన్ని ఒబామా రాసుకున్నారు.