Swiggy Report: ఫుడ్ లవర్స్ ఆల్ టైం ఫేవరెట్ బిర్యానీయే.. ఒక్క సెకనులో రెండు బిర్యానీలు లాగించేస్తున్నారట!

స్విగ్గీలో చికెన్ బిర్యానీ తర్వాత అత్యధికంగా ఆర్డర్ చేయబడిన మొదటి ఐదు వస్తువులు మసాలా దోస, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్ ఉన్నాయి. నివేదిక ప్రకారం భారతీయ రుచులతో పాటు అంతర్జాతీయ రుచులను కూడా భారతీయులు బాగానే ఇష్టపడుతున్నారట. ఆల్ టైమ్ ఫేవరెట్ పిజ్జాతో పాటు సుషీ, మెక్సికన్ బౌల్స్, కొరియన్ రామెన్, ఇటాలియన్ పాస్తా వంటి వంటకాలు ఈ లిస్టులో ఉన్నాయి

Swiggy Report: ఫుడ్ లవర్స్ ఆల్ టైం ఫేవరెట్ బిర్యానీయే.. ఒక్క సెకనులో రెండు బిర్యానీలు లాగించేస్తున్నారట!

Swiggy Report says India Ordered 2 Biryanis Every Second

Swiggy Report: ఫుడ్ డెలివరీ మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారింది. మనకు ఆకలిగా అనిపించినప్పుడల్లా లేదా మనకు ఇష్టమైన ఆహారాన్ని తినాలని అనిపించినా వెంటనే మన జేబులోని స్మార్ట్‭ఫోన్‭ బయటకు తీసి నిమిషాల వ్యవధిలో కావల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేస్తుంటాం. ఇందులో అనేక భారతీయ వంటకాలు ఉన్నాయి. రోజురోజుకు మరెన్నో కొత్త వంటకాలు ఆన్‭లైన్ డెలివరీలో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఎన్ని వెరైటీలు ఉన్నప్పటికీ ఫుడ్ లవర్స్ హాట్ ఫేవరేట్ బిర్యానీయే అని స్విగ్గీ తేల్చి చెప్పింది.

Supreme Court: అందుకేగా మేమున్నది.. వ్యక్తిగత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

స్విగ్గీ నిర్వహించిన సర్వేలో ఈ యేడాది (2022) ఆన్‭లైన్‭లో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటం బిర్యానీ. స్విగ్గీ నివేదిక ప్రకారం, చికెన్ బిర్యానీ వరుసగా ఏడవ సంవత్సరం కూడా యాప్‌లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన డిష్‌గా అగ్రస్థానంలో ఉంది. ఇవి ఎంతలా అమ్ముడు పోతున్నాయంటే.. దేశ వ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ చేయడంతో దాని అగ్రస్థానాన్ని పదిల పరుచుకుందట. అంతే ఒక సెకను వ్యవధిలో 2.28 బిర్యానీలు అర్డర్ అవుతున్నట్లు స్విగ్గీ నివేదిక గురువారం వెల్లడించింది.

Gurugram: మూత్ర విసర్జనకని బెంజ్ కారును రోడ్డు పక్కన ఆపిన లాయర్.. కత్తితో బెదిరించి కారెత్తుకెళ్లిన దుండగులు

స్విగ్గీలో చికెన్ బిర్యానీ తర్వాత అత్యధికంగా ఆర్డర్ చేయబడిన మొదటి ఐదు వస్తువులు మసాలా దోస, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్ ఉన్నాయి. నివేదిక ప్రకారం భారతీయ రుచులతో పాటు అంతర్జాతీయ రుచులను కూడా భారతీయులు బాగానే ఇష్టపడుతున్నారట. ఆల్ టైమ్ ఫేవరెట్ పిజ్జాతో పాటు సుషీ, మెక్సికన్ బౌల్స్, కొరియన్ రామెన్, ఇటాలియన్ పాస్తా వంటి వంటకాలు ఈ లిస్టులో ఉన్నాయి. అర్థరాత్రి కోరికల విషయానికి వస్తే, రాత్రి 10 గంటల తర్వాత 22 లక్షల ఆర్డర్‌లతో పాప్‌కార్న్ మొదటి స్థానంలో ఉంది. ఇంతలో, గులాబ్ జామూన్ 2022లో 27 లక్షల సార్లు ఆర్డర్ చేయబడిన ఇష్టమైన ఐటంగా నిలిచింది.