T.Cong Rally : ప్రజలను దోచుకోవడానికి కరోనా అడ్డురాదు గానీ నిరసనలు తెలపడానికి అడ్డు వస్తుందా? : రేవంత్ రెడ్డి

ప్రజల్ని దోచుకోవటానికి కరోనా నిబంధనలు అడ్డురావుగానీ..నిరసనలు తెలియజేస్తే వాటిని కరోనా నిబంధనలు అడ్డు వస్తాయా? అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలపై పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలపటానికి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినాధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లి తీరతామని స్పష్టం చేశారు.

T.Cong Rally : ప్రజలను దోచుకోవడానికి కరోనా అడ్డురాదు గానీ నిరసనలు తెలపడానికి అడ్డు వస్తుందా? : రేవంత్ రెడ్డి

T. Congress Rally

Telangana Congress rally to protest high petrol prices revanth reddy : పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ‘ఛలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. కానీ దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకూ అనుమతులు ఇవ్వాలేదు. కరోనా నిబంధనలు కారణంగా ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తెలిపారు. దీనిపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సెంట్రల్లో ప్రధాని మోడీ..తెలంగాణ స్టేట్ లో సీఎం కేసీఆర్ ప్రజలు దోచుకుంటున్నారని విమర్శించారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా తాము నిరసన ర్యాలీ చేపడుతుంటే కోవిడ్ నిబంధనల దృష్టా అనుమతులు ఇవ్వం అని పోలీసులు అంటున్నారు.

ప్రజల్ని దోచుకోవటానికి కరోనా నిబంధనలు అడ్డురావుగానీ..నిరసనలకు అడ్డు వస్తాయా? అని ప్రశ్నించారు. పేదలపై పెట్రోల్, డీజిల్ ధరలు భారం మోపుతున్నారనీ..ఆరోపించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా శుక్రవారం (జులై 16,2021) ధరల పెరుగుదలపై ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లి తీరతామని స్పష్టం చేశారు.ర్యాలీగా వెళ్లి గవర్నర్ కు వినతిపత్రం ఇస్తామని తెలిపారు. పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని తెలిపారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్ లో మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని వెల్లడించారు.

కాగా ఇటు కాంగ్రెస్ ర్యాలీ. అటు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటం..వెరసి శుక్రవారం కాంగ్రెస్ ‘ఛలో రాజ్‌భవన్’ ర్యాలీ చేసి తీరుతామని స్పష్టంచేయటంతో ఈ కార్యక్రమంపై టెన్షన్ నెలకొంది. చలో రాజ్‌భవన్‌కు ఇప్పటివరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ.. పోలీసులు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. శాంతి భద్రతల కారణంగాను..కరోనా నిబంధల కారణంగాను అనుమతివ్వలేమని పోలీసులు పేర్కొన్నారు. ఇందిరాపార్క్ దగ్గర కేవలం 2 మైక్‌లతో సభకు అనుమతి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటున్న కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు.