తెలంగాణలో లక్షణాలు లేకుండానే సోకిన కరోనా..వీరి ద్వారానే కేసులు ఎక్కువ

  • Published By: madhu ,Published On : September 1, 2020 / 08:24 AM IST
తెలంగాణలో లక్షణాలు లేకుండానే సోకిన కరోనా..వీరి ద్వారానే కేసులు ఎక్కువ

CORONA

తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ సోకందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. లక్షణాలు కనిపించని వారు తమకు తెలియకుండానే ఇతరులకు అంటించే ప్రమాదం ఎక్కువని, ఇటువంటి కేసుల కారణంగానే ఇతరులకు పెద్దసంఖ్యలో వైరస్‌ సోకుతోందని వెల్లడించింది. ఈ కారణంగానే అనేక కుటుంబాల్లో 15 నుంచి 20 మందికి కూడా కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు.



రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు వచ్చిన కేసులను విశ్లేషించింది. మొత్తం కేసుల్లో 69 శాతం మంది లక్షణాలు లేకుండానే కరోనా బారినపడ్డారు. 31 శాతం మందికే కరోనా లక్షణాలు బయటపడ్డాయని తేల్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,24,963 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 86,225 మందికి లక్షణాల్లేవని తెలిపింది. ఇక 38,738 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి.
https://10tv.in/pm-modis-mann-ki-baat-video-gets-over-5-lakh-dislikes-on-youtube-amid-outrage-over-neet-jee/
అయితే..ఎక్కువ మంది వేగంగా కోలుకుంటున్నారని, ప్రాథమిక, సెకండరీ కాంటాక్టులను పరీక్షల ద్వారా గుర్తించి తక్షణ వైద్యం చేయడం వల్ల చాలామంది కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నారని వెల్లడించంది. వీరిని ఇళ్లలోనే ఉంచుతూ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,299 యాక్టివ్‌ కేసులుంటే, 24,216 మంది ఇళ్లు లేదా వివిధ సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.