Viral Video: వారెవ్వా ఏం టాలెంట్.. పాడేసిన డబ్బాలతో డ్రమ్స్ వాయించిన చిన్నారి

Viral Video: వారెవ్వా ఏం టాలెంట్.. పాడేసిన డబ్బాలతో డ్రమ్స్ వాయించిన చిన్నారి

Viral Video

Viral Video: పేద పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది. అయితే, వారిలో చాలామందికి వారి టాలెంటును బయటపెట్టుకునే అవకాశాలు రావు. కొందరు తమ వద్ద సౌకర్యాలతోనే తమ నైపుణ్యాలను బయటకు తీస్తుంటారు. ఆ పనే చేశాడు ఓ చిన్నారి. ఆ పిల్లాడి వద్ద డ్రమ్స్ వాయించడానికి అవసరమైన సౌకర్యాలు లేవు. అతడి వయసు ఆరేళ్లు కూడా లేదు.

ఇంత చిన్నవయసులో, అదీ పేద కుటుంబంలో పుట్టి డ్రమ్స్ వాయించడం నేర్చుకోవడమే కష్టం అనుకుంటే ఈ పిల్లాడు మాత్రం పాడేసిన డబ్బాలతో అద్భుతంగా డ్రమ్స్ వాయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జిజియన్ టాంగ్ అనే ఓ వ్యక్తి ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

పాత డబ్బాలు, వంట పాత్రలను బోర్లించి, వాటిని లయబద్ధంగా కొడుతూ ఆ చిన్నారి అలరించాడు. ఎంతో సంతోషంగా అతడు వాటిని వాయించడం చూస్తుంటే చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇప్పటికే ఈ వీడియో 4.4 కోట్ల మంది చూశారు. ఆ బాలుడి చిరునామా చెప్పాలని, నిజమైన డమ్ సెట్ ను కొనిపిస్తామని కొందరు కోరారు.

 

View this post on Instagram

 

A post shared by ZIJIAN TANG (@james_tang_123)

‘World Oldest Jeans’: 165 ఏళ్లనాటి జీన్స్ ప్యాంట్..! ధర అక్షరాలా Rs.94 లక్షలు..!!