Tim Cook: ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వార్షిక వేతనం 40 శాతానికి పైగా కట్

టిమ్ కుక్ వేతనం గత ఏడాది కన్నా దాదాపు 40 శాతం కంటే అధికంగా తగ్గుతుంది. దీంతో సవరించిన జీతం ప్రకారం 2023లో టిమ్ కుక్ వార్షిక వేతనం రూ.398.85 కోట్లని ఆపిల్ పేర్కొంది. అందులో బేస్ శాలరీ 24.4 కోట్లు. ఇందులో మార్పులేదు. అయితే, బోనస్, స్టాక్స్ రూపంలో టిమ్ కుక్ వచ్చే మొత్తం భారీగా తగ్గింది. ఈక్వీటీ రూ.325.65 కోట్లుగా, బోనస్ రూ.48 కోట్లుగా ఉంది.

Tim Cook: ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వార్షిక వేతనం 40 శాతానికి పైగా కట్

Apple CEO Tim Cook

Tim Cook: జీతాలు సరిపోవడం లేదని, పెంచాలని సంస్థలను ఉద్యోగులు అడగడం సాధారణమే. అయితే, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ మాత్రం తన ప్యాకేజ్ అధికంగా ఉందని, తగ్గించాలని అడిగారు. టిమ్ కుక్ వార్షిక వేతనంపై సంస్థ వాటాదారుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, విమర్శల మేరకు టిమ్ కుక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఈ ఏడాది టిమ్ కుక్ జీతం మాత్రం భారీగా తగ్గింది.

సారణంగా ప్రతి ఏడాది వేతనాలు పెరుగుతాయి. టిమ్ కుక్ వేతనం మాత్రం గత ఏడాది కన్నా దాదాపు 40 శాతం కంటే అధికంగా తగ్గుతుంది. దీంతో సవరించిన జీతం ప్రకారం 2023లో టిమ్ కుక్ వార్షిక వేతనం రూ.398.85 కోట్లని ఆపిల్ పేర్కొంది. అందులో బేస్ శాలరీ 24.4 కోట్లు. ఇందులో మార్పులేదు. అయితే, బోనస్, స్టాక్స్ రూపంలో టిమ్ కుక్ వచ్చే మొత్తం భారీగా తగ్గింది. ఈక్వీటీ రూ.325.65 కోట్లుగా, బోనస్ రూ.48 కోట్లుగా ఉంది.

టిమ్ కుక్ వార్షిక వేతనం 2022లో మొత్తం రూ.809.30గా ఉంది. అందులో బేస్ శాలరీ రూ.24.4 కోట్లు కాగా, మిగతా అంతా బోనస్, స్టాక్స్ రూపంలో వచ్చేది. 2021లో టిమ్ కుక్ వార్షిక వేతనం రూ.803.53 కోట్లుగా ఉండేది. వాటాదారుల అభిప్రాయాలు, ఆపిల్ అసాధారణ పనితీరు, కుక్ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ ఏడాది టిమ్ కుక్ వేతనాన్ని తగ్గించినట్లు ఆ సంస్థ తెలిపింది. యాపిల్ సీఈవోగా టిమ్ కుక్ 2011లో బాధ్యతలు స్వీకరించారు. ఆపిల్ ను స్థిరంగా నడిపిస్తూ ఎన్నో విజయాలను అందిస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఫైలింగ్ లో ఆపిల్ తాజాగా ఆయన వార్షిక వేతన వివరాలు తెలిపింది.

Sankranti Bus Stands Passengers : సంక్రాంతికి పల్లెబాట పడుతున్న నగరవాసులు.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు