MAA Elections: విష్ణు విక్టరీకి, ప్రకాష్‌రాజ్ ఓటమికి.. టాప్ టెన్ రీజన్స్ ఇవే..!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. మంచు విష్ణు ఘన విజయం సాధించి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. విష్ణు గెలుపు, ప్రకాష్ రాజ్ ఓటమికి ప్రధానంగా 10 కారణాలు కనిపిస్తున్నాయి.

MAA Elections: విష్ణు విక్టరీకి, ప్రకాష్‌రాజ్ ఓటమికి.. టాప్ టెన్ రీజన్స్ ఇవే..!

Resons

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. మంచు విష్ణు ఘన విజయం సాధించి.. ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. మొదటినుంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు కనిపించిన ప్రకాష్ రాజ్.. అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో విష్ణు విజయానికి.. ప్రకాష్ రాజ్ ఓటమికి.. ప్రధానంగా పది కారణాలు కనిపిస్తున్నాయి.

లోకల్ – నాన్ లోకల్: మంచు విష్ణు ప్యానెల్ వ్యూహాత్మకంగా మొదలు పెట్టిన లోకల్ – నాన్ లోకల్ ప్రచారం బాగా పని చేసింది. టాలీవుడ్ సీనియర్ నటులు చాలా మంది ఈ విషయంపై నేరుగా స్పందించారు. తెలుగు వాళ్లే మా.. అసోసియేషన్ కు అధ్యక్షుడైతే బాగుంటుందని కామెంట్ చేస్తూ వచ్చారు. మంచు విష్ణుకు బహిరంగంగా సపోర్ట్ చేశారు. ఆ ప్రభావం.. పోలింగ్ పై పడి.. మంచు విష్ణు విజయానికి ఉపయోగపడిందని స్పష్టంగా చెప్పొచ్చు.

విష్ణు ప్లానింగ్: ప్రకాష్ రాజ్ చేయని పనిని.. మంచు విష్ణు చేసి చూపించారు. దాదాపుగా.. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నటులందరితోనూ నేరుగా మాట్లాడారు. కొందరిని డైరెక్ట్‌గా కలిశారు. మరికొందరితో ఫోన్ లో మాట్లాడారు. అవసరమైన వారికి తమ డబ్బులు కట్టి మరీ పోస్టల్ బ్యాలెట్లను సమకూర్చారు. రాజ్యాంగ పరంగా అది తమ హక్కు అనీ.. లీగల్ గానే తాను ఈ విషయంలో ప్రొసీడ్ అయ్యానని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉన్న ‘మా’ సభ్యులను.. హైదరాబాద్‌కు రప్పించి మరీ ఓటు వేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది.. విష్ణు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.

ప్రకాష్ రాజ్ వ్యవహారశైలి: ప్రకాష్ రాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్.. అతని ఓటమికి కారణమైందని స్పష్టమవుతోంది. టాలీవుడ్ పెద్దల మద్దతు అవసరం లేకుండానే తాను పోటీ చేస్తానని ఆయన కామెంట్ చేయడం.. సహజంగానే సీనియర్ నటుల్లో కోపం తెప్పించి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే.. ఆయన కాస్త మెగా ఫ్యామిలీతో తప్ప ఎవరితోనూ కలవకపోవడం.. మద్దతు కోరకపోవడం.. అదే సమయంలో విష్ణు.. చాలా మంది సపోర్ట్ కూడగట్టడం.. ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపింది.

ప్రభావం చూపిన ప్రకాష్ రాజ్ గతం: మంచు విష్ణు విజయానికి.. ప్రకాష్ రాజ్ ఓటమికి.. గతం కూడా ఓ కారణంగా నిలిచింది. నిర్మాతలతో ప్రకాష్ రాజ్‌కు ఉన్న విభేదాలు.. పదే పదే ఎదుర్కొన్న నిషేధాలు.. షూటింగ్ కు కూడా టైమ్ కు వెళ్లని వ్యక్తి ‘మా’ అధ్యక్షుడిగా పనికిరారంటూ వచ్చిన విమర్శలు.. విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి. వీటిని సరిగ్గా క్యాష్ చేసుకోవడంలో మంచు విష్ణు అండ్ కో.. సక్సెస్ అయ్యింది. తమ ప్రచారంలో.. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో విష్ణు.. ఈ విషయాన్ని చాలాసార్లు ఎత్తిచూపారు. చివరికి తన విజయానికి అవసరమైన ఓట్లు సాధించడంలో విజయవంతమయ్యారు.

నాగబాబు కామెంట్లు: ప్రకాష్ రాజ్‌కు ముందునుంచీ మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు.. మా ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు.. టాలీవుడ్ లో రచ్చ లేపాయని చెప్పొచ్చు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై.. నేరుగా ప్రకాష్ రాజ్ కు పడిన ఓట్లపై ప్రభావం చూపాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే.. మంచు విష్ణును ఉద్దేశించి కూడా నాగబాబు చేసిన విమర్శలు.. ప్రకాష్ రాజ్ కు మంచి కంటే చెడునే ఎక్కువగా చేశాయని కొందరు భావిస్తున్నారు.

విష్ణు స్ట్రాటజికల్, సెన్సిబుల్ అటాక్: ప్రకాష్ రాజ్‌పై.. అలాగే మెగా ఫ్యామిలీపై.. మంచు ఫ్యామిలీ చేసిన స్ట్రాటజికల్, సెన్సిబుల్ అటాక్.. బాగా పని చేసింది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై.. మోహన్ బాబు హుందాగా స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత.. నాగబాబు చేసిన విమర్శలపై మంచు విష్ణు ఇచ్చిన సెన్సిటివ్ రిప్లై.. అంతే బాగా పని చేసింది. అదీ కాకుండా.. చిరంజీవి, పవన్.. తనకే ఓటు వేస్తారంటూ విష్ణు పదే పదే చెప్పడం.. టాలీవుడ్ లోని ఇతర వర్గాలను సైతం ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఓ దశలో.. తన ఫ్యామిలీ గురించి వచ్చిన విమర్శలకు సైతం.. విష్ణు అగ్రెసివ్ గా బదులిచ్చిన తీరు.. అతనికి మద్దతును కూడగట్టినట్టే కనిపిస్తోంది.

సీనియర్ నటుడు నరేష్ ప్లానింగ్: మా.. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు.. మంచు విష్ణు ప్యానెల్ కు మధ్య ఉన్న ప్రధాన తేడా.. సీనియర్ నటుడు నరేష్. గతంలో.. నాగబాబు మద్దతుతో మా అధ్యక్షుడిగా విజయం సాధించిన నరేష్.. ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీకి దూరమయ్యారు. మంచు విష్ణుకు అండగా నిలబడ్డారు. విష్ణుకు బహిరంగంగా మద్దతు తెలిపారు. తన అనుభవాన్నంతా పెట్టి మరీ.. ఎత్తులు వేశారు. విష్ణును వ్యూహాత్మకంగా కదిలించి.. మా అధ్యక్షుడిగా గెలిచేలా.. తెర వెనక కథను అన్నీ తానై నరేష్ నడిపించారు.

ఒంటరైన ప్రకాష్ రాజ్: బరిలో నిలుచుంటానని చెప్పిన సమయం నుంచి.. మంచు విష్ణు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లారు. మద్దతును బలంగా కూడగట్టారు. ఇదే సమయంలో.. ప్రకాష్ రాజ్ ఒంటరైపోయారు. టాలీవుడ్ లో బలమైన మెగా ఫ్యామిలీ నుంచి కాస్త మద్దతు లభించినా.. ఇతరుల నుంచి ఏ మాత్రం సపోర్ట్ అందుకోలేకపోయారు. అంతిమంగా.. విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. సీనియర్ నటుడు నరేష్ వంటి వాళ్ల విమర్శలను, నాన్ లోకల్ వివాదాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోవడం కూడా.. ఆయనకు మైనస్ అయ్యింది.

విష్ణు మేనిఫెస్టో: మా.. ఎన్నికల్లో.. మంచు విష్ణు మేనిఫెస్టో కీ రోల్ ప్లే చేసింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు తన సొంత డబ్బులతో భవనం కట్టించి ఇస్తానన్న హామీకి తోడు.. మహిళా సభ్యులకు భద్రత కోసం కమిటీ.. సభ్యత్వ రుసుము తగ్గింపు.. మా సభ్యుల పిల్లలకు స్కాలర్ షిప్పులు.. మా సభ్యుల కుమార్తెల వివాహానికి కల్యాణ లక్షి పేరుతో ఆర్థిక సహాయం, మెరుగైన హెల్త్ పాలసీ.. సభ్యులుగా ఉన్న నటులకు అవకాశాలు ఇప్పించేందుకు ప్రత్యేక యాప్ రూపకల్పన.. ఇలా చాలా విషయాలతో విష్ణు రూపొందించిన మేనిఫెస్టో.. అతనికి ఘన విజయాన్ని అందించిందని చెప్పాలి. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ వైఫల్యాన్ని.. విష్ణు మేనిఫెస్టో బయటపెట్టింది.

మోహన్ బాబు: ప్రస్తుతం జరిగిన ‘మా’ ఎన్నికల విషయంలో.. కచ్చితంగా చెప్పుకోవాల్సింది సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి. తన కుమారుడు విష్ణు బరిలో ఉన్నప్పటి నుంచి ఆయన చురుగ్గా కదిలారు. ప్రత్యర్థుల విమర్శలకు ఓపిగ్గా, హుందాగా బదులిచ్చారు. తనకున్న అనుభవంతో.. సీనియర్ నటుల మద్దతును విష్ణుకు కూడగట్టేలా చక్రం తిప్పి విజయం సాధించారు. విష్ణుకు తాను క్రమశిక్షణను ఆస్తిగా ఇచ్చానని.. ఇచ్చిన హామీని విష్ణు కచ్చితంగా నిలబెట్టుకుంటాడని పదే పదే చెప్పుకొచ్చారు. గతంలో టాలీవుడ్ పెద్ద అయిన దివంగత దాసరి శిష్యుడిగా.. తన అనుభవాన్నంతా రంగరించారు. విష్ణుకు పెట్టని కోటగా మోహన్ బాబు నిలబడ్డారు. తన బిడ్డను గెలిపించుకోవడంలో.. అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించారు. ఇదే సమయంలో.. మోహన్ బాబు లాంటి బలమైన వ్యక్తి మద్దతును ప్రత్యక్షంగా కూడగట్టుకోవడంలో విఫలం చెందిన ప్రకాష్ రాజ్.. ఓటమిని మూటగట్టుకున్నారు.

Also Read:

MAA Elections: మంచు విష్ణు విజయం

MAA Elections: మంచు విష్ణు కంటతడి.. ఫలితాల అధికారిక ప్రకటన సమయంలో కన్నీళ్లు!

MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓటమి.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

MAA Elections: మా ఎన్నికల ఫలితాలపై.. ఎవరేమన్నారంటే!

MAA Elections Effect: మా.. ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. నాగబాబు షాకింగ్ డెసిషన్!

MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓడిపోతాడని ముందే చెప్పా, ఓటమికి కారణమిదే.. టీడీపీ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

MAA Elections 2021 ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం బాధగా ఉంది