Rashmika Mandanna : అండర్వేర్ యాడ్ లో రష్మిక.. ఈ యాడ్ ఎలా చేశావంటూ భారీ ట్రోలింగ్

స్టార్ డం వచ్చాక హీరో, హీరోయిన్స్ యాడ్స్ లో నటించడం మామూలే. రష్మిక కూడా కొన్ని యాడ్స్ లో నటించింది. అయితే ఇటీవల తను నటించిన ఓ యాడ్ రష్మికని ఇబ్బందుల్లో పడేసింది

Rashmika Mandanna : అండర్వేర్ యాడ్ లో రష్మిక.. ఈ యాడ్ ఎలా చేశావంటూ భారీ ట్రోలింగ్

Rashmika

Rashmika Mandanna :  సౌత్‌ ఇండియాలో అన్ని భాషల్లో నటిస్తున్న హీరోయిన్ రష్మిక. తెలుగులో ‘ఛలో’ సినిమాతో పరిచయం అయి వరుసగా స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది. త్వరలో ‘మిషన్‌ మజ్న’ సినిమాతో బాలీవుడ్‌కి కూడా వెళ్లబోతుంది. రష్మికకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. నేషనల్ క్రష్ అంటూ రష్మికకి పెద్ద ట్యాగ్ ఇచ్చారు అభిమానులు. సోషల్ మీడియాలో సైతం రష్మికకి మంచి ఫాలోయింగ్ ఉంది.

స్టార్ డం వచ్చాక హీరో, హీరోయిన్స్ యాడ్స్ లో నటించడం మామూలే. రష్మిక కూడా కొన్ని యాడ్స్ లో నటించింది. అయితే ఇటీవల తను నటించిన ఓ యాడ్ రష్మికని ఇబ్బందుల్లో పడేసింది. తాజాగా బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె చేసిన అండర్‌వేర్‌ యాడ్‌ కి భారీ విమర్శలు ఎదురయ్యాయి. ఈ యాడ్ లో రష్మిక ఒక యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండగా, విక్కీ యోగా చేస్తుంటాడు. ఆ సమయంలో షర్ట్‌ పైకి లేచి విక్కీ అండర్‌వేర్‌ కనిపిస్తుంది. దానిపై ఆ అండర్వేర్ మ్యాచో కంపెనీ నేమ్ కూడా కనిపిస్తుంది. అది గమనించిన రష్మిక ఇంప్రెస్‌ అయ్యి అండర్వేర్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఈ యాడ్ ఇప్పుడు విమర్శలపాలవుతుంది.

MAA Elections : తెలంగాణ నినాదంతో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న సీనియర్ నటుడు..

ఇలాంటి చీప్‌ యాడ్‌ ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్లు ఆ కంపెనీని ట్రోల్ చేస్తున్నారు. రష్మిక నుంచి ఇలాంటి చీప్ యాడ్ వస్తుందని ఊహించలేదు అని, అసలు రష్మిక ఈ యాడ్ కి ఎలా ఒప్పుకుందని, ఈ యాడ్ లో అమ్మాయిలను తక్కువగా చూపించారని నెటిజన్లు రష్మికని ట్రోల్ చేస్తున్నారు. అభిమానులు ఇలాంటి యాడ్స్‌లో రష్మిక నటించడం కరెక్ట్‌ కాదని విమర్శిస్తున్నారు.