Telangana : కేంద్రం గెజిట్‌తో తెలంగాణకు నష్టం.. కేంద్రానికి TS GENCO లెటర్

రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చిన తరువాతే గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు TS Genco చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రావు కేంద్రానికి సమాచారం పంపించారు.

10TV Telugu News

TS GENCO : కేంద్ర ఇంధన నియంత్రణ శాఖ కార్యదర్శికి లెటర్ రాశారు తెలంగాణ స్టేట్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ల ప్రకారం… జల విద్యుత్ ఉత్పత్తి అంశం… కేంద్రం పరిధిలోకి వెళ్తే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీఎండీ ప్రభాకర్ రావు లెటర్ లో అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్, సాగునీటి అవసరాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

KTR : తెలంగాణ రెండో ఐటీ పాలసీ..10 లక్షల మందికి ఉద్యోగాలు

విద్యుత్ శాఖలో సిబ్బంది బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు రాలేదని సీఎండీ ప్రభాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఆయా బోర్డ్ ల నుంచి అందుతున్న సూచనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చిన తరువాతే గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు TS Genco చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రావు కేంద్రానికి సమాచారం పంపించారు.

Telangana : దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన రాష్ట్రంగా తెలంగాణ