TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్‍ లీక్ కేసు.. ప్రవీణ్, రాజశేఖర్ ల కస్టడీ విచారణకు అనుమతి

శంకర్ లక్ష్మీ కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయింది. శంకర్ లక్ష్మీతోపాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్‍ లీక్ కేసు.. ప్రవీణ్, రాజశేఖర్ ల కస్టడీ విచారణకు అనుమతి

TSPSC Paper Leak (3)

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్‍ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ను ప్రశ్నించేందుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో ప్రవీణ్, రాజశేఖర్ లను కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.పేపర్ లీకేజీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది.

ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు ఇప్పటివరకు అరెస్టైన నిందితులందరినీ విచారించాలని భావించారు. ఇందులో భాగంగానే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ లను కస్టడీ విచారణకు అనుమతించాలని ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రవీణ్, రాజశేఖర్ లను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ను ముందుగానే విదేశాలకు పంపారని, ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ

హవాలా రూపంలో డబ్బులు చేతులు మారాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నట్లు అనుమానిస్తున్న ఈడీ.. సిట్ సాక్షిగా చేర్చిన శంకర్ లక్ష్మీపై దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఆమె పని చేస్తున్నారు. శంకర్ లక్ష్మీ కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయింది. శంకర్ లక్ష్మీతోపాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది.

బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం చేపిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసును సిట్ ముమ్మర దర్యాప్తు చేసింది. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ తరలించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు

సిట్ అధికారులు తమ దర్యాప్తు రిపోర్టును సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందజేశారు. ఈ కేసును నెల రోజులపాటు సిట్ విచారించింది. ఈ కేసులో 17 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్ కీలక నిందితులుగా ఉన్నారు. ఏఈ ఎగ్జామ్, గ్రూప్ 1, డీఏఓ ప్రశ్నాపత్రాలను ప్రవీణ్, రాజశేఖర్ లీక్ చేశారు. సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రశ్నించారు. బోర్డు సెక్రటరీ, సభ్యుడి స్టేట్ మెంట్ ను నివేదికలో పొందుపర్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికను సైతం జత పరిచారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 24కు హైకోర్టు వాయిదా వేసింది.