Vande Bharat train: ట్రయల్ రన్‌లో సమర్థంగా 180 కేఎంపీహెచ్ వేగంతో వెళ్ళిన అత్యాధునిక ‘వందే భారత్’ రైలు

నిన్న 120/130/150 కేఎంపీహెచ్ వేగంతో పాటు 180 కేఎంపీహెచ్ తో ట్రయల్ రన్ నిర్వహించామని అధికారులు చెప్పారు. ఆ సమయంలోనే రైలు 180 కేఎంపీహెచ్ వేగాన్ని దాటి సమర్థంగా నడిచిందని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ట్వీట్ చేశారు. రాజస్థాన్‌లోని కోటా మధ్యప్రదేశ్ లోని నాగ్దా మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు వివరించారు. ప్రాథమిక పరిశీలనలో భాగంగా వందే భారత్ రైలుకి సంబంధించి పలు అంశాలను చెక్ చేశామని అధికారులు చెప్పారు.

Vande Bharat train: ట్రయల్ రన్‌లో సమర్థంగా 180 కేఎంపీహెచ్ వేగంతో వెళ్ళిన అత్యాధునిక ‘వందే భారత్’ రైలు

Vande Bharat train

Vande Bharat train: వందే భారత్ రైలు ట్రయల్ రన్‌లో సమర్థంగా 180 కేఎంపీహెచ్ వేగంతో వెళ్ళిందని అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు భారత ప్రభుత్వం ఈ అత్యాధునిక వందే భారత్‌ రైళ్ళను తయారు చేయిస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో 400 కొత్తతర వందే భారత్‌ రైళ్ళను ప్రవేశపెట్టనున్నట్లు గత కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా తయారైన రైళ్ళకు ట్రయల్ రన్ నిర్వహిస్తారు.

నిన్న 120/130/150 కేఎంపీహెచ్ వేగంతో పాటు 180 కేఎంపీహెచ్ తో ట్రయల్ రన్ నిర్వహించామని అధికారులు చెప్పారు. ఆ సమయంలోనే రైలు 180 కేఎంపీహెచ్ వేగాన్ని దాటి సమర్థంగా నడిచిందని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ట్వీట్ చేశారు. రాజస్థాన్‌లోని కోటా మధ్యప్రదేశ్ లోని నాగ్దా మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు వివరించారు. ప్రాథమిక పరిశీలనలో భాగంగా వందే భారత్ రైలుకి సంబంధించి పలు అంశాలను చెక్ చేశామని అధికారులు చెప్పారు.

వివిధ ప్రాంతాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ అత్యాధునిక వందే భారత్‌ రైళ్ళను పూర్తిగా భారత్ లోనే తయారు చేస్తున్నారు. ఇవి సెమీ-హై-స్పీడ్ ట్రైన్లు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, ఏసీ చైర్ కార్ వంటివి ఉంటాయి. తక్కువ విద్యుత్తును వినియోగించుకునేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైళ్ళను స్టీల్‌తో కాకుండా తక్కువ బరువు ఉండే అల్యూమినియంతో రూపొందిస్తున్నారు.

Viral video: మొసళ్ల మధ్య నదిలో పడిపోయిన బాలుడు.. ప్రాణభయంతో అరుపులు.. తర్వాత ఏం జరిగిందంటే..