Viral video: వారెవ్వా.. కోతి తెలివి.. జింకల ఆకలి తీర్చేందుకు కోతి ఏం చేసిందో చూడండి

జింకలు, కోతి సన్నిహితంగా ఉండటం చాలా అరుదు. కానీ, ఒక అటవీ ప్రాంతంలో రెండు జింకలు, ఒక కోతి సన్నిహితంగా ఉంటున్నాయి. జింకలకు ఆ కోతి చేసిన సాయమేంటో మీరూ చూడండి.

Viral video: వారెవ్వా.. కోతి తెలివి.. జింకల ఆకలి తీర్చేందుకు కోతి ఏం చేసిందో చూడండి

Viral video: జంతువులు సాధారణంగా ఆహారం కోసం ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంటాయి. చాలా వరకు ఒక దాన్ని ఇంకోటి చంపి తింటాయి. అయితే, కొన్నిసార్లు ఒకదానికొకటి సాయం చేసుకుంటాయి. జాతి వైరాన్ని మరిచి
కలిసుంటాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. మీకే అర్థమవుతుంది.

Uttar Pradesh: తండ్రితో కలిసి భార్యను చంపిన డాక్టర్.. 400 కిలోమీటర్ల దూరంలో రహస్యంగా అంత్యక్రియలు

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద షేర్ చేసిన వీడియో ఇది. ఈ వీడియో ప్రకారం.. ఒక అటవీ ప్రాంతంలో రెండు జింకలు, ఒక కోతి కొంతకాలంగా సన్నిహితంగా కలిసుంటున్నాయి. అవి ఒకదానికొకటి సాయం చేసుకుంటున్నాయి. జింకలు గడ్డితోపాటు చెట్లు ఆకుల్ని కూడా ఆహారంగా తీసుకుంటాయనే సంగతి తెలిసిందే. అయితే, ఈ జింకలకు తినేందుకు చెట్టు కొమ్మలు అందడం లేదు. కొమ్మలు ఎత్తులో ఉండటంతో, వాటికి కోతి సాయం చేసింది. చెట్టెక్కిన కోతి, ఆ చెట్టు కొమ్మల్ని కిందికి వంచింది. దీంతో కొమ్మలు కిందికి వంగడంతో జింకలు ఎంచక్కా వాటిని తిన్నాయి.

జింకలు ఆకుల్ని తినేంత వరకు కోతి కొమ్మని వంచుతూనే ఉంది. తనతో కలిసితిరిగే జింకల ఆకలి తీర్చేందుకు ఆ కోతి తెలివిగా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.