Viral Video: 3 రోజుల పాటు శిథిలాల కింద చిన్నారి.. బయటకు వచ్చాక అంబరాన్నంటే ఆనందం

మూడు రోజుల తర్వాత మనుషులను చూసిన ఆ చిన్నారి అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తనను రక్షించిన వారందరినీ కొడుతూ చిరునవ్వులు చిందించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూడు రోజుల పాటు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ బాలుడిని బయటకు తీయగానే మొదట కన్నీరు పెట్టుకుంటున్నట్లు కనపడ్డాడు.

Viral Video: 3 రోజుల పాటు శిథిలాల కింద చిన్నారి.. బయటకు వచ్చాక అంబరాన్నంటే ఆనందం

Viral Video

Viral Video: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ధాటికి వేలాది ఇళ్లు కుప్పకూలిపోవడంతో చాలా మంది చిన్నారులు ఆచూకీ కూడా తెలియడం లేదు. ఇంకా శిథిలాల కిందే చాలా మంది చిక్కుకుపోయి ఉన్నారు. చిన్నారులను బయటకు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ చిన్నారి మూడు రోజుల పాటు శిథిలాల కిందే ఉండి, సురక్షితంగా బయటపడి అందరినీ ఆశ్చర్యపర్చాడు.

మూడు రోజుల తర్వాత మనుషులను చూసిన ఆ చిన్నారి అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తనను రక్షించిన వారందరినీ కొడుతూ చిరునవ్వులు చిందించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మూడు రోజుల పాటు లోపల బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆ బాలుడిని బయటకు తీయగానే మొదట కన్నీరు పెట్టుకుంటున్నట్లు కనపడ్డాడు.

ఆ తర్వాత చిరునవ్వులు వెదజల్లాడు. భవనం కుప్పకూలినప్పటికీ ఆ బాలుడికి శిథిలాలు తగలలేదు. దీంతో అతడికి గాయాలు కాలేదు. అయితే, మూడు రోజుల పాటు లోపల అంతటి భయంతో ఎలా గడిపాడంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లోపల ఆ బాలుడి వద్ద తినడానికి ఏమైనా ఉండొచ్చని కొందరు అంటున్నారు. కాగా, టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ధాటికి ఇప్పటివరకు 17,500 మంది ప్రాణాలు కోల్పోయారు.

Viral Video: “సో స్వీట్”.. సీమంతంలో దంపతుల డ్యాన్స్ అదుర్స్