Viral video: కాబోయే భార్యకు విమానంలో సర్‌ప్రైజ్ ఇచ్చిన యువకుడు

తనకు కాబోయే భార్యకు ఆకాశంలో విమాన ప్రయాణంలో ఓ యువకుడు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇష్టపడుతున్న అమ్మాయికి యువకులు అనేక రకాలుగా సర్‌ప్రైజ్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ యువకుడు మాత్రం అందరిలా భూమిపై కాకుండా గగనతలంలో సర్‌ప్రైజ్ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

Viral video: కాబోయే భార్యకు విమానంలో సర్‌ప్రైజ్ ఇచ్చిన యువకుడు

Viral video

Viral video: తనకు కాబోయే భార్యకు ఆకాశంలో విమాన ప్రయాణంలో ఓ యువకుడు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇష్టపడుతున్న అమ్మాయికి యువకులు అనేక రకాలుగా సర్‌ప్రైజ్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు.

అయితే, ఈ యువకుడు మాత్రం అందరిలా భూమిపై కాకుండా గగనతలంలో సర్‌ప్రైజ్ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఓ అమ్మాయి వెనుక సీటులో కూర్చుకుంది. ఓ పోస్టర్ పట్టుకుని ఆమె వద్దకు వెళ్లాడు ఓ యువకుడు. అతడిని, ఆ పోస్టర్ ను చూసి ఆ యువతి ఆశ్చర్యపోయింది. అనంతరం ఆ యువకుడిని వద్దకు వెళ్లి హగ్ ఇచ్చింది.

ఆ తర్వాత ఆ యువకుడు మోకాళ్లపై కూర్చుని, ఆమెకు ఉంగరం ఇచ్చి ఐ లవ్యూ చెప్పాడు. వారిని చూసి తోటి ప్రయాణికులు అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఈ దృశ్యాలను ఎయిర్ ఇండియా సిబ్బంది ఒకరు కెమెరాలో చిత్రీకరించారు. ‘మ్యారేజ్ ప్రపోజల్ మేడిన్ హీవెన్’ అంటూ ఒకరు ఈ వీడియోను పోస్ట్ చేశారు. గాలిలో తమ ప్రేమను తెలిపిన ఆ యువకుడి ఆలోచన బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.