Viral Video: నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతపై దాడి చేసిన కొండ చిలువ.. తరువాత ఏం జరిగిందంటే..

వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా చిరుతను వేటాడేందుకు వచ్చిన కొండ చిలువకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Viral Video: నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతపై దాడి చేసిన కొండ చిలువ.. తరువాత ఏం జరిగిందంటే..

Viral Video: అడవిలో కొన్నిసార్లు వేటాడేందుకు వెళ్లిన జంతువే.. వేటకు బలవుతుంది. కొన్ని జంతువుల మధ్య జరిగే పోరులో అప్పుడు ఏ జంతువు బలమైంది అయితే అదే గెలుస్తుంది. కొండ చిలువ- చిరుత లేదా మొసలి-చిరుత తలపడితే ఏది గెలుస్తుందో చెప్పడం కష్టం.

Suryakumar Yadav: సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్.. న్యూజిలాండ్‌పై 65 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

కొన్నిసార్లు ఎద్దులు, ఏనుగులు వంటి వాటి దాడిలో సింహాలు, పులులు కూడా గాయపడుతుంటాయి. తాజాగా ఒక కొండ చిలువ చిరుతపై దాడి చేసింది. కానీ, అనూహ్యంగా ఆ చిరుత నోటికే చిక్కింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ అయిన వీడియో ప్రకారం.. నీళ్లు తాగేందుకు ఒక నది దగ్గరకు వచ్చిన చిరుతపైకి దూకి దాడి చేయబోయింది కొండచిలువ. ఆ చిరుతను చుట్టి, చంపి తినాలనుకుంది. కానీ, వెంటనే అప్రమత్తమైన చిరుత దాన్నుంచి తప్పించుకుని ఎదురు దాడి చేసింది. నీటిలో కొండ చిలువను పట్టుకోగలిగింది. ఆ కొండ చిలువను నోట కరుచుకుంది.

దీంతో చిరుతను చంపాలనుకున్న కొండ చిలువ దానికే బలైపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. సాధారణంగా సింహాలు, పులులు, చిరుతలు వంటివి కొండ చిలువల్ని అరుదుగా వేటాడుతుంటాయి. ఎక్కువగా ఇతర జంతువుల్నే ఆహారంగా తీసుకుంటాయి. కానీ, ఈ సారి మాత్రం ఈ చిరుత పులికి కొండ చిలువ చిక్కింది.

 

 

View this post on Instagram

 

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)