కరోనా దెబ్బకు ఆసియా అంతటా బలవంతపు బాల్య వివాహాలు

  • Published By: sreehari ,Published On : September 2, 2020 / 03:33 PM IST
కరోనా దెబ్బకు ఆసియా అంతటా బలవంతపు బాల్య వివాహాలు

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఆర్థిక మందగమనంలోకి నెట్టేసింది. కోవిడ్ దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలో కురుకు పోయాయి. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన చాలా కుటుంబాలు పేదరికంలో మునిగిపోయాయి.. ఒక్క ఆసియాలోనే పదివేల మంది బాలికలు పేదరికంలో మునిగిపోయారు. పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయలేక బాల్య వివాహాలకు సిద్ధమవుతున్నారు.



ప్రపంచంలో చాలా దేశాల్లో బాల్య వివాహమనేది ఎప్పుడి నుంచో సాంప్రదాయంగా కొనసాగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఈ బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయి కటిక పేదరికాన్ని అనుభవించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆ కుటుంబాల్లోని అమ్మాయిలను చదివించలేని తల్లిదండ్రులు పోషణ భారాన్ని భరించలేక చిన్నతనంలోనే బాల్య వివాహాలకు పూనుకుంటున్నారు.ఇండోనేషియా ద్వీపసమూహంలోని భారతదేశం, పాకిస్తాన్, వియత్నాం వరకు సాంప్రదాయ సమాజాలలో బాల్య వివాహం ఎప్పుటినుంచో ఉంది..

అయితే విద్య, మహిళల భద్రతతో పాటు వారిని స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించడం ద్వారా బాల్య వివాహాలు తగ్గుతూ వస్తున్నాయి.. కానీ, కరోనా వైరస్ ప్రభావంతో పెద్ద మొత్తంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలు గత్యంతరం లేక తమ పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయాలని చూస్తున్నారని నిపుణులు అంటున్నారు.



పేదరికానికి తోడు విద్య లేకపోవడం, అభద్రత, బాల్యవివాహాల వైపు నడిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సంక్షోభాల కాలం కావడంతో ఈ సమస్యను మరింత పెంచుతోందని స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి ఏడాదిలో 18 ఏళ్ళకు ముందే 12 మిలియన్ల మంది బాలికలు వివాహం చేసుకుంటున్నారని అంచనా.



కరోనాపై అత్యవసర చర్యలు తీసుకోకపోతే ఆర్ధిక, సామాజిక ప్రభావంతో పాటు వచ్చే దశాబ్దంలో అదనంగా 13 మిలియన్ల బాల్యవివాహాలు జరుగుతాయని సంస్థ హెచ్చరించింది. ఆసియాలో చిన్నారులకు బలవంతపు వివాహాలు జరుగుతున్నాయని స్వచ్ఛంద సంస్థలు నివేదిస్తున్నాయి. ఇప్పటికే పదివేల మంది బాల్యవివాహాలకు ప్రభావితమయ్యారని అంచనా వేస్తున్నారు.

దీనికి సంబంధించి డేటా అందుబాటులో లేదు. లాక్ డౌన్ వ్యవధిలో బాల్యవివాహాలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. నిరుద్యోగం, ఉద్యోగ నష్టం కారణంగా ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని అంటున్నారు. కుటుంబ భారంతో చాలా కుటుంబాలు తమ బిడ్డలకు చిన్నతనంలో బాల్య వివాహాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి..



భారతదేశంలో, బలవంతపు వివాహాలు పెరిగాయని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. ఎందుకంటే యువతులు కోవిడ్ -19 వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పరిష్కారంగా ఆయా కుటుంబాలు తమ పిల్లలకు బాల్య విహహాలు చేస్తున్నాయని అన్నారు. ఇండోనేషియా కుటుంబ నియంత్రణ సంస్థ ఇప్పటికే 270 మిలియన్ల మందిని హెచ్చరించింది.

పాఠశాల మూసివేత, గర్భనిరోధక శక్తి తగ్గిపోవటం వలన వచ్చే ఏడాది ప్రారంభంలో శిశువుల జననంపై ప్రభావం పడనుంది. యునిసెఫ్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక బాల్యవివాహాలలో ఒకటిగా ఉన్న ఇండోనేషియా, గత ఏడాదిలో సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో వివాహానికి చట్టబద్దమైన వయస్సును 16 నుండి 19ఏళ్లకు పెంచింది. కానీ, ఇందులోనూ లొసగులు ఉన్నాయి.



ఇండోనేషియా ఇస్లామిక్ అధికారులు ఈ ఏడాది జనవరి, జూన్ మధ్యకాలంలో 33,000 కు పైగా బాల్యవివాహాలను అధికారికంగా అనుమతించారు. 2019 మొత్తానికి మొత్తం 22,000 తో పోలిస్తే.. మహిళా సాధికారత, పిల్లల రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా వివాహ వయస్సును 18 నుండి 21 ఏళ్ల వరకు పెంచుతున్నామని చెప్పారు. వియత్నాంలో, వివాహం చేసుకోవడానికి చట్టబద్దమైన వయస్సు 18ఏళ్లు ఉండాలి..


కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో బాలికలంతా ఇంటికే పరిమితమయ్యారు.. ఈ క్రమంలో అమ్మాయిల తల్లిదండ్రులు కుటంబ పోషణ భారంగా భావించి 14 ఏళ్ల వయస్సులోనే బాలికలకు వివాహం చేస్తున్నారు.. అందుకే బాల్య వివాహాలు పెరుగుతున్నాయని స్థానిక స్వచ్ఛంద సంస్థ తెలిపింది.