Cute Girl Video: ఐస్‌క్రీమ్‌ ఇవ్వకుండా పాపను ఏడిపించిన వ్యక్తి.. మండిపడ్డ నెటిజన్లు

ఐస్‌క్రీమ్‌లు అమ్మేవారు చిన్నారులను ఆటపట్టించడానికి ఐస్‌క్రీమ్‌ను ఇచ్చీఇవ్వకుండా కొన్ని ట్రిక్కులు ప్రదర్శిస్తుంటారు. అయితే, కొందరు చిన్నారులు ఆ ట్రిక్కులతో విసుగెత్తిపోయి కన్నీరు పెట్టుకుంటారు. ఇటువంటి ఘటనే టర్కీలో చోటుచేసుకుంది. ఓ పాప ఐస్‌క్రీమ్‌ కోసం ఏడ్చిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అవుతోంది.

Cute Girl Video: ఐస్‌క్రీమ్‌ ఇవ్వకుండా పాపను ఏడిపించిన వ్యక్తి.. మండిపడ్డ నెటిజన్లు

Cute Girl Video

Cute Girl Video: ఐస్‌క్రీమ్‌లు అమ్మేవారు చిన్నారులను ఆటపట్టించడానికి ఐస్‌క్రీమ్‌ను ఇచ్చీఇవ్వకుండా కొన్ని ట్రిక్కులు ప్రదర్శిస్తుంటారు. అయితే, కొందరు చిన్నారులు ఆ ట్రిక్కులతో విసుగెత్తిపోయి కన్నీరు పెట్టుకుంటారు. ఇటువంటి ఘటనే టర్కీలో చోటుచేసుకుంది. ఓ పాప ఐస్‌క్రీమ్‌ కోసం ఏడ్చిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అవుతోంది.

దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ పాప ఐస్‌క్రీమ్‌ కొందామని వెళ్లింది. అయితే, ఆమెను ఐస్‌క్రీమ్‌ అమ్మే వ్యక్తి దాన్ని ఇచ్చినట్లు ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకుంటాడు. అలా చేసిన ప్రతిసారి ఆ పాప విపరీతంగా ఏడుస్తుంది. అయినప్పటికీ ఆ పాపకు ఐస్‌క్రీమ్‌ ఇవ్వకుండా అలాగే చేస్తుంటాడు.

చివరకు ఆ పాప తండ్రి ఆమెను ఎత్తుకున్నాక ఐస్‌క్రీమ్ దక్కుతుంది. పాపను అంతగా ఎందుకు ఏడిపించారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ పాప ఏడుస్తుంటే మిగతా వాళ్లంతా నవ్వడం ఏంటని కొందరు ప్రశ్నించారు. ఇటువంటి ఆటలు ఆడడం ఏంటని మరికొందరు నిలదీశారు.


10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..