Viral Video: ఒకే చేతిపై 16 దోశ ప్లేట్లు పెట్టుకుని తీసుకెళ్లి క‌స్ట‌మ‌ర్ల‌కు ఇచ్చిన వెయిట‌ర్

ఒకే చేతిపై 16 దోశ ప్లేట్లు పెట్టుకుని తీసుకెళ్లి క‌స్ట‌మ‌ర్ల‌కు ఇచ్చాడు ఓ వెయిట‌ర్. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో ప‌నిచేసేవారు చేతితో ప్లేట్ల‌ను తిప్పుతూ అవి కింద ప‌డ‌కుండా తీసుకుపోవ‌డం మ‌నం చూస్తుంటాం.

Viral Video: ఒకే చేతిపై 16 దోశ ప్లేట్లు పెట్టుకుని తీసుకెళ్లి క‌స్ట‌మ‌ర్ల‌కు ఇచ్చిన వెయిట‌ర్

Waiter Balances 16 Plates

Viral Video: ఒకే చేతిపై 16 దోశ ప్లేట్లు పెట్టుకుని తీసుకెళ్లి క‌స్ట‌మ‌ర్ల‌కు ఇచ్చాడు ఓ వెయిట‌ర్. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో ప‌నిచేసేవారు చేతితో ప్లేట్ల‌ను తిప్పుతూ అవి కింద ప‌డ‌కుండా తీసుకుపోవ‌డం మ‌నం చూస్తుంటాం.

అయితే, ఓ వెయిట‌ర్ మాత్రం ఒకే చేతిలో 16 దోశ‌ల‌ను పెట్టుకుని అవి కింద ప‌డ‌కుండా హోట‌ల్ లోని క‌స్ట‌మ‌ర్ల‌కు ఇచ్చాడు. ఎడ‌మ చేతిపై దోశ ప్లేట్ల‌ను పెట్టుకుని అత‌డు తీసుకువెళ్లాడు. ఒక‌దానిపై ఒక‌టి పెట్టుకుని అత‌డు వాటిని తీసుకెళ్లిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది.

ఆ వెయిట‌ర్ దోశ‌ల‌ను అలా తీసుకు వెళ్తున్న స‌మ‌యంలో అత‌డి స్నేహితుడు వీడియో తీశాడు. మ‌హీంద్ర గ్రూప్ ఛైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ యువ‌కుడు ప‌ని చేసిన తీరుకు నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఈ వెయిట‌ర్ హోట‌ల్ లో న‌లుగురు చేసే ప‌నిని ఒక్క‌డే సునాయాసంగా చేసేస్తాడ‌ని అంటున్నారు.

Bengaluru Incident : బాబోయ్.. వీడియో కాల్‌లో భార్యను చూపించలేదని సహోద్యోగిపై కత్తెరతో దాడి