బుల్ షార్క్.. 16 అడుగుల మొసలి ఎదురుపడిన వేళ.. షాకింగ్ వీడియో..!

  • Published By: sreehari ,Published On : November 27, 2020 / 03:59 PM IST

Bull Shark Face To Face Crocodile : సముద్రపు ఉప్పునీటిలో రెండు రారాజులే.. నీళ్లలో ఎంతటి జంతువునైనా ఇట్టే మింగేయగల బలశాలులవి. అనుకోని అతిథి ఎవరైనా తమ స్థావరాల్లోకి వస్తే.. మళ్లీ తిరిగి పోలేవంతే.. అలాంటి రెండు భారీ జలచరాలు మొసలి, షార్క్ అనుకోకుండా ఎదురుపడ్డాయి.

ఆ సమయంలో ఏం జరిగింది.. భీకర పోరు జరిగి ఉంటుంది. ఎవరూ గెలిచారని అనుకుంటున్నారు? అయితే ఈ షాకింగ్ వీడియో చూడాల్సిందే.. వాస్తవానికి షార్కు కంటే మొసలి అతిపెద్దదిగా ఉంది.



దాదాపు 16 అడుగుల పొడవు ఉన్న మొసలిని దగ్గరగా చూస్తే ఇంకేమైనా ఉందా? అందులోనూ నీళ్లలో.. బతికిబయటపడటం కష్టమే.. కానీ, బుల్ షార్క్ మాత్రం తేలివిగా మొసలి బారినుంచి అంగుళం దూరంలో ప్రాణాలతో తప్పించుకుంది.

మొసలికి కొన్ని అంగుళాల దూరంలో ఉన్నప్పుటే మొసలిని పసిగట్టిన బుల్ షార్క్ వెంటనే తన రూట్ మార్చేసింది. ఆకలితో ఉన్న మొసలి నేరుగా తనవైపు దూసుకొస్తున్న షార్క్‌ను కదలకుండా చూస్తూ అలానే ఉండిపోయింది.  దగ్గరకు రాగానే లటుక్కుమని పట్టేసుకోవచ్చులే అనుకుంది.



కానీ, అక్కడివరకు వచ్చిన షార్క్ వెంటనే మొసలి ఉందని పసిగట్టింది. అంతే తుర్రమని మరో మార్గంలో జారుకుంది. 16 అడుగుల పొడవైన మొసలి కంటే బుల్ షార్క్ చాలా చిన్నది.. దీన్ని ఒకేసారి మొసలి మింగేయగలదు..
https://10tv.in/shocking-video-shows-stray-dog-nibbling-at-girls-body-in-up-hospital/
అందుకే ప్రాణభయంతో షార్క్ తెలివిగా తప్పించుకుని పోయింది. ఈ రోజుకు ఆహారం దొరికిందిలేని సంబరపడ్డ మొసలికి నిరాశే ఎదురైంది. చేసేదేం లేక మరో ఆహారం కోసం వెతకుతూ ముందుకు వెళ్లిపోయింది.



ఈ షాకింగ్ దృశ్యాన్ని ఆస్ట్రేలియాలో చేపలు పట్టేందుకు వెళ్లిన చెల్సా, బ్రైస్ అనే ఇద్దరు.. ప్రెడేటర్లరు ఎదురుపడిన దృశ్యాన్ని డ్రోన్ కెమెరాతో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ వీడియోకు యూట్యూబ్‌లో 1.6 లక్షల వ్యూస్ వచ్చాయి. నిజానికి ఈ వీడియో గత నెలలో రికార్డు చేసి యూట్యూబ్ లో పోస్టు చేశారు. అప్పటినుంచి ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.