ఏదీ సీజనల్ ? ఏదీ వైరస్..మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

  • Published By: madhu ,Published On : July 26, 2020 / 01:30 PM IST
ఏదీ సీజనల్ ? ఏదీ వైరస్..మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

ఏదీ సీజనల్ ? ఏదీ వైరస్ వర్షాకాలంలో ప్రజలను వణికిస్తోంది. ఓ వైపు కరోనా కమ్మేస్తోంది. ఎప్పటిలాగానే సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రెండింటి లక్షణలు కాస్తా అటు..ఇటుగా ఉంటుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఏదీ కరోనా వైరస్ ? ఏదీ సీజనల్ వ్యాదో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కరోనాపై ఇంకా ప్రజలకు అనుమాన్నాలున్నాయి. ఈ అంశంపై 10tv ప్రత్యేక చర్చ చేపట్టింది. ఇందులో డా.ముఖర్జీ (కార్డియాలజిస్టు) పాల్గొని అభిప్రాయాలు తెలియచేశారు.

సీజనల్ వ్యాధులు : –
సీజనల్ వ్యాధులు (ఫ్లూ, మాములు జలుబు, మలేరియా, డెంగ్యూ, మోషన్స్ ఇతర) చెప్పవచ్చు. కామన్ కోల్డ్, ఫ్లూలు గాలి ద్వారా వస్తాయి. జలుబు, జ్వరం, దగ్గు ఉంటే తప్పకుండా కరోనా టెస్టు చేయించుకోవాల్సిందే. కోల్డ్, ఫ్లూలు తగ్గిపోతాయి. మలేరియా దోమలతో వస్తాయి. చలి, జ్వరం ఎక్కువగా ఉంటుంది. దోమలు ఉండకుండా చూసుకోవాలి.



దగ్గు, జ్వరం ఉంటే : –
డెంగ్యూ విషయంలో కరోనాను పోలి ఉంటుంది. జ్వరం అధికంగా వస్తుంది. దగ్గు, ఆయాసం మలేరియ, డెంగ్యూలో ఉండవు. బయట పట్టుకున్న వాటిని చేతులు కడుక్కోకుండా…తినడం వల్ల మోషన్స్ వచ్చే అవకాశం ఉంది. లూస్ మోషన్స్ తో పాటు శ్వాస కోశ ఇబ్బందులు, దగ్గు, జ్వరం ఉంటే తప్పకుండా..కరోనా చెక్ చేయించుకోవాల్సిందే.

పెద్దవారి వద్దకు వెళ్లకండి-
భయపడాల్సిన అవసరం లేదు. సీజనల్ వ్యాధి ఎలా వచ్చి తగ్గిపోతుందో..అదే విధంగా కరోనా నయం అవుతుంది. కరోనా అయితే..మీరు ఐసోలేషన్ ఉండి..పెద్ద వారిని కలువకుండా…చూసుకోవాలి. జలుబు, దగ్గు ఉన్నవారు చిన్నపిల్లలు, పెద్ద వారి వద్దకు వెళ్లకండి.


సొంత వైద్యం పనికి రాదు : –
ఇంట్లో ఉండి..ట్రీట్ మెంట్ తీసుకోవడం, సొంత వైద్యం చేసుకోవడం తేడా ఉంటుంది. కానీ సొంత వైద్యం వరకు ప్రాబ్లమ్స్ వస్తుంది. మెడిసిన్స్, సైడ్ ఎఫెక్ట్ అందరికీ తెలిసిందే కదా. క్లోరిఫిన్ ఇస్తే బాగుంటుందని అనుకున్నారు..కానీ పనిచేయడం లేదని అంటున్నారు. చిన్న చిన్న విషయాలు తెలియకుండా..సొంత వైద్యం తీసుకుంటే..చాలా ప్రమాదకరం.

ట్యాబెట్ల్ తీసుకుంటున్నారు : –
విపరీతంగా మెడిసిన్స్ తీసుకుంటున్నారు. జింక్ ట్యాబ్లెట్, విటమిన్ డి ట్యాబెట్లు తీసుకుంటున్నారు. ఏ, డీ, ఏ, కే సంబంధించిన మందులు వాడుతున్నారు. క్లోరిఫిన్ తీసుకుంటే..80 శాతం తగ్గుతుందని ఐసీఎంఆర్ వెల్లడించింది. కానీ అంతగా నమ్మడం లేదు.


కరోన వచ్చి తగ్గిన తర్వాత షుగర్ : –
బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే…బాగానే ఉంటుంది..కానీ ఉపయోగం లేదని గమనించాలి. కరోనా వచ్చిన తర్వాత భవిష్యత్ షుగర్స్ అన్ కంట్రోల్ గా ఉంటున్నాయి. బాడీలో విపరీతమైన ఒత్తిడి ఉంటే, స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల బ్లడ్ లెవల్స్ అధికం చేస్తాయి. షుగర్ లేని వారికి కొత్తగా షుగర్ వస్తుందని గమనించాం. 60-80 శాతం వచ్చి తగ్గిపోతే..కరోనా వ్యాధి తక్కువుతుంది.

హైదరాబాద్ లో కరోనా తగ్గేది  : –
ఢిల్లీ అందరికంటే ముందు ఉంది. ఢిల్లీలో పీక్ వచ్చింది..మరలా తగ్గింది. ఇటలీ, ఇరాన్, ఇతర దేశాల్లో ఇలాగే ట్రెండ్ ఉంది. హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ లో కేసులు తగ్గే అవకాశం ఉంది. ఇంక రెండు, మూడు నెలలు జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి వైరస్ రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ..తక్కువగా ప్రమాదం ఉంటుంది. కరోనా వచ్చినా ఏమీ కాదు..తగ్గిపోతుంది’ అని డా.ముఖర్జీ (కార్డియాలజిస్టు) తెలిపారు.