Home » ముగ్గురు హీరోయిన్లు ఉంటేనే సినిమా చేస్తామంటున్న స్టార్స్..
Published
1 month agoon
By
sekharTripule Heroines: ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీ హీరోయిన్ ట్రెండ్ నడుస్తోంది. హీరోల క్రేజ్‌తో పాటు ఇద్దరు లేదా ముగ్గరు హీరోయిన్లతో సినిమాలకు కలరింగ్ పెంచుతున్నారు మేకర్స్.. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకూ అందరూ ముగ్గురేసి హీరోయిన్లతో డ్యూయెట్లు పాడబోతున్నారు.
‘శ్యామ్ సింగరాయ్’
టాలీవుడ్లో ముగ్గరు హీరోయిన్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోల పక్కన ముగ్గురేసి భామలు సందడి చేయబోతున్నారు. నేచురల్ స్టార్ నాని – శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కోసం ముగ్గరు తారలను తీసుకోబోతున్నారు. ఒక క్యారెక్టర్ కోసం ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కన్ఫామ్ అయ్యింది. ఇక మెయిన్ లీడ్ రోల్లో సాయి పల్లవి నటించబోతోంది. మరో గెస్ట్ హీరోయిన్ పాత్ర కోసం.. నివేధా పేతురాజ్, అదితీ రావ్ హైదరీలను అనుకుంటున్నారు.
బాలయ్యకి అచ్చొచ్చిన ముగ్గురు భామలు
ముగ్గురు భామల ట్రెండ్‌ను బాగా ఫాలో అవుతారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లో ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలతో ఆడిపాడారాయన..
ప్రస్తుతం బోయపాటితో ట్రాక్‌లో ఉన్న హ్యాట్రిక్ మూవీలో కూడా ముగ్గరు భామలను తీసుకున్నారు. అయితే ఈ సినిమాకు ఫస్ట్ నుంచి హీరోయిన్ల ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది పేర్లు వినిపించి.. తరువాత మరుగున పడిపోతున్నాయి.
రీసెంట్గా సయేషా సైగల్ ఫిక్స్ అయినట్టు ప్రకటించిన మేకర్స్ ఆమె స్థానంలో ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నారు. పూర్ణ మరో హీరోయిన్ కాగా అంజలి కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరి బాలయ్య సరసన పూర్తిస్థాయి పాత్ర ఎవరికి దక్కుతుందో చూడాలి..
‘ఖిలాడి’ కీ ముగ్గురు..
ఇక ‘క్రాక్’ సినిమాతో రిలీజ్‌కు రెడీగా ఉన్న మాస్ మహారాజా రవితేజ కూడా.. నెక్ట్స్ తను చేయబోయే ‘ఖిలాడి’ సినిమాలో ముచ్చటగా ముగ్గరు భామలతో చిందేయబోతున్నారు. ‘క్రాక్’ తరువాత రమేష్ వర్మ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు రవితేజ. ‘వీర’ లాంటి మాస్ సినిమాను రవితేజతో చేసిన రమేష్.. ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతీని హీరోయిన్స్‌గా ఫిక్స్ చేశారు. మూడో హీరోయిన్గా హాట్ యాంకర్ అనసూయ నటించబోతున్నట్టు తెలుస్తోంది.
పవర్‌స్టార్ పక్కన కూడా..
వీళ్లే కాదు ‘వకీల్ సాబ్’ లో స్టోరీ డిమాండ్‌ను బట్టి.. అంజలి, నివేధా థామస్‌తో పాటు పవర్‌స్టార్ భార్య పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. ఇక ‘కింగ్’ నాగార్జున ‘బంగార్రాజు’ లో కూడా ముగ్గరు భామలు కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా చాలా మంది స్టార్స్ ముగ్గరు భామలతో డ్యూయెట్లు పాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.