తూర్పు లడఖ్ లో జవాన్లకు అత్యాధునిక నివాస సౌకర్యాలు,వెచ్చని టెంట్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Troops In Eastern Ladakh Get Upgraded Living Facilities గడ్డకట్టే చలిని సైతం భరిస్తూ తూర్పు లడఖ్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాల కోసం భారత ఆర్మీ మెరుగైన నివాస సౌకర్యాలను ఏర్పాటుచేసింది. శీతాకాలంలో విధుల్లో ఉన్న భద్రతా దళాల ఆపరేషనల్ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు భారత ఆర్మీ…తూర్పు లడఖ్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతాదళాలన్నింటీకి అప్ గ్రేడెడ్ నివాస సౌకర్యాల ఏర్పాటును పూర్తి చేసినట్లు భారత ఆర్మీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.కొన్నేళ్లుగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సదుపాయాలతో కూడిన స్మార్ట్ క్యాంప్‌లతో పాటు, విద్యుత్తు, నీరు, హీటింగ్ ఫెసిలిటీస్, ఆరోగ్యం మరియు పరిశుభ్రత కోసం సమగ్ర ఏర్పాట్లతో కూడిన అత్యాధునిక ఆవాసాలు దళాలకు వసతి కల్పించడానికి తాజాగా సృష్టించబడ్డాయని ఆ ప్రకటనలో ఆర్మీ తెలిపింది. ముందు వరుసలో ఉన్న దళాలు హీటెడ్ టెంట్స్(వెచ్చగా ఉండే గుడారాలు)లో ఉంచబడతారని తెలిపింది. అదనంగా, సైనికుల యొక్క ఏవైనా అత్యవసర అవసరాలను తీర్చడానికి తగిన పౌర మౌలిక సదుపాయాలు కూడా గుర్తించబడ్డాయని తెలిపింది.కాగా,కొన్ని నెలలుగా తూర్పు లడఖ్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెల నుంచి తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ(LAC)వద్ద భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్ఠంభణ నెలకొన్న విషయం తెలిసిందే. జులై నెలలో గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. గల్వాన్ ఘర్షణలో రెండు వైపులా ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే.మరోవైపు, ఈ ఏడాది అక్టోబర్ లో శీతాకాలం సమీపించే ముందే చైనా ఆర్మీ వాస్తవాధీన రేఖ ప్రాంతంలో విధుల్లో ఉన్న తమ సైనికుల కోసం అధునాతన సౌకర్యాలను సిద్దం చేసిన విషయం తెలిసిందే. సోలార్ మరియు విండ్ పవర్ సౌకర్యాలు మరియు 24గంటలపాటు వేడి నీరు సరఫరా, షవర్ సౌకర్యాలు, క్యాంటీన్లు వంటివి ఇందులో ఉన్నారు.

Related Tags :

Related Posts :