Home » చందా కొచ్చర్ కి సీబీఐ షాక్: పారిపోకుండా లుక్ అవుట్ నోటీస్ జారీ
Published
2 years agoon
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కి మరో షాక్ తగిలింది. వీడియోకాన్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంకు రుణాల కేసులో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధుత్ లకు వ్యతిరేకంగా సీబీఐ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. 3వేల250 కోట్ల రూపాయల వీడియోకాన్ కేసులో ఇప్పటికే చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధుత్ లపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. ప్రొసీడింగ్స్ లో భాగంగానే సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. చందా కొచ్చర్ దేశం వది వెళ్లకుండా దేశవ్యాప్తంగా సరిహద్దులు, విమానాశ్రయాల్లోని ఇమ్మిగ్రేషన్ అధికారులకు సీబీఐ ఆదేశాలు జారీ చేసింది.
2012లో ఐసీఐసీఐ బ్యాంక్ వీడియో కాన్ గ్రూప్ కి 3వేల250 కోట్ల రూపాయల లోన్ మంజూరు చేసింది. ఈ రుణం మంజూరు వ్యవహరంలో క్విడ్ ప్రోకో జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి పొందిన రుణాల్లో కోట్ల రూపాయలను చందాకొచ్చర్ భర్తకు చెందిన దీపక్ కొచ్చర్ కి చెందిన న్యూపర్ లో పెట్టుబడులుగా పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో చందా కొచ్చర్ పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో 2018 అక్టోబర్-4న ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ పదవి నుంచి ఆమె వైదొలిగారు.
దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధుత్ లకు గత ఏడాది జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్లను పునరుద్ధరించగా,చందా కొచ్చర్ కు లుక్ ఔట్ నోటీసు జారీ చేయడం ఇదే మొదటిసారి.