చిన్న సారు.. పెద్ద సారు కావ‌డం ఖాయం అంటోన్న తెరాస నేతలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేటీఆర్.. ఇప్పుడు తెలంగాణలో యూత్ ఐకాన్ లీడ‌ర్. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన త‌నదైన శైలిలో ప‌రిపాల‌న వ్యవహారాలు చ‌క్కబెడుతున్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీఎం కేసీఆర్.. త‌న వార‌సుడిగా కేటీఆర్‌ను సీఎంగా చేస్తార‌ని చ‌ర్చ జోరుగా సాగింది. తాను త‌ప్పుకుంటున్నాన్న వార్తల‌ను కొట్టిపారేసిన కేసీఆర్… కేటీఆర్‌ను సీఎంను చేయ‌న‌ని ఎక్కడా చెప్పలేదు. దీంతో ఇక కేటీఆర్ కాబోయే సీఎం అనే చ‌ర్చ ఇప్పటికీ కొన‌సాగుతూనే ఉంది.

బుధవారం ప్రగ‌తిభ‌వ‌న్‌లో కేటీఆర్… స‌హ‌చ‌ర‌ మంత్రులతో క‌లిసి నిర్వహించిన మీటింగ్.. ఇప్పుడు మ‌రోసారి ఆయనే సీఎం అనే వార్తలకు తెర లేపింది. ఈ విష‌యాన్ని ఆ మీటింగ్‌లో పాల్గొన్న మెజార్టీ మంత్రులు త‌మ స‌న్నిహితుల ద‌గ్గర అంటున్నారు. మీటింగ్‌లో కేటీఆర్ వ్యవ‌హ‌రించిన తీరు మంత్రుల‌ను క‌ట్టిప‌డేసింద‌ట‌.

ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాల‌సీపై కేటీఆర్ చేసిన ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ చూసి.. సీనియ‌ర్ మంత్రులు సైతం ఔరా అంటున్నారు. స‌బ్జెక్టులపై కేటీఆర్‌కు ఉన్న అవ‌గాహ‌న, పట్టు చూసి ఆశ్చర్యపోయారట. టోట‌ల్ మీటింగ్‌ను కేటీఆర్ హ్యాండిల్ చేసిన తీరుకు ఫిదా అయిపోయార‌ట‌.

మీటింగ్‌లో చాలామంది సీనియ‌ర్ మంత్రులతో పాటు తొలిసారి మంత్రులైన వారు కూడా కొందరున్నారు. వారంద‌ర‌నీ స‌బ్జెక్టులో ఇన్వాల్వ్ చేసిన తీరు చాలా బాగుంద‌ని ఓ సీనియర్‌ అంటూనే.. సీఎంగా కేటీఆర్‌కు పక్కాగా సామర్థ్యం ఉందని స‌న్నిహితుల‌తో అన్నారట. ఈ మీటింగ్ ఎనిమిది గంట‌ల పాటు ఏక‌బిగిన సాగినా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిందంటే ఆ క్రెడిట్ అంతా కేటీఆర్‌దే అంటున్నారు ఆ మంత్రి.

అస‌లు మీటింగ్ ఎప్పుడు పూర్తైందో తెలియ‌లేదంటూ ఆశ్చర్యపోతున్నారట. ఇటీవల కేటీఆర్ మంత్రిగా ఎన్నో స‌మీక్షలు నిర్వహిస్తున్నా బుధ‌వారం జ‌రిగిన ఆ మీటింగ్ మాత్రం స్పెష‌ల్ అంటున్నారు గులాబీ నేత‌లు. ఇంకేముంది.. మా చిన్న సారు.. పెద్ద సారు కావ‌డం ఖాయం అని చెప్పుకుంటున్నారట. చూడాలి మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో?

Related Tags :

Related Posts :