TRS Must Win 16 Loksabha Seats, KTR

16 ఎంపీ సీట్లు గెలుద్దాం : ఢిల్లీని శాసిద్దాం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 సీట్లు గెలిచి ఢిల్లీని

హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 17 సీట్లకు 16 సీట్లు గెలిచి ఢిల్లీని శాసిద్దాం అని చెప్పారు. తెలంగాణభవన్ లో పలు పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరారు. వారిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. 16 ఎంపీ సీట్లను గెలిస్తే కేంద్రాన్ని శాసించి రాష్ట్రాభివృద్ధిని చేసుకోవడం సులభం అవుతుందని కేటీఆర్ చెప్పారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో టీఆర్ఎస్ చక్రం తిప్పబోతోందని కేటీఆర్ అన్నారు. 2014 ఎన్నికలకు భిన్నంగా 2019 ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీలకు పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి 150 ఎంపీ సీట్లు కూడా దక్కే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకి కనీసం 100 ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ తరుణంలో తెలంగాణలో 16 ఎంపీ సీట్లను టీఆర్ఎస్ గెలిస్తే కేంద్రాన్ని శాసించే పరిస్థితి ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని కేటీఆర్ చెప్పారు.
Read Also : వారణాశి వదిలేస్తారా : పూరి నుంచి ఎన్నికల బరిలో ప్రధాని?

కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవచ్చని కేటీఆర్ అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు రూ.24వేల కోట్లు తెప్పించుకోవచ్చన్నారు. టీఆర్ఎస్ 16 సీట్లు గెలిస్తే.. మనం ఢిల్లీ చుట్టూ తిరగడం కాదు.. వాళ్లే మన చుట్టూ తిరుగుతారని, మనకు సలామ్ కొడతారని, వద్దన్నా నిధులు ఇస్తారని, బుల్లెట్ రైలు, ఎంఎంటీఎస్ రైలు, ప్రాజెక్టులకు జాతీయ హోదా వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్లు అన్న కేటీఆర్.. సమయం చూసి దెబ్బ కొట్టాలన్నారు. పోరాడే సత్తా ఉన్న గులాబీ బిడ్డలు కావాలో.. ఢిల్లీ గులామ్ లు కావాలో తెలంగాణ సమాజం తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, టీఎస్ ఐపాస్ లాంటి ఎన్నో అద్భుతమైన, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని కేటీఆర్ అన్నారు. దేశం మొత్తం.. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పథకాలను కాపీ కొడుతున్నాయని చెప్పారు. వ్యవసాయం దండగ అన్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా అన్నదాత సుఖీభవ పథకం తీసుకొచ్చారని, దానికి కేసీఆర్ స్ఫూర్తి అని కేటీఆర్ అన్నారు.
Read Also : వైసీపీ మమ్మల్ని నిలువునా ముంచేసింది : తిప్పారెడ్డి భార్య

Related Posts