ట్రంప్ కీలక నిర్ణయం…H-1B వీసా జారీలో లాటరీ పద్ధతికి గుడ్ బై!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Trump admin proposes to scrap lottery system to select H-1B భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ సర్కాక్ బిగ్ షాక్ ఇచ్చింది. మరో ఐదు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం వెలువడనున్న నేపథ్యంలో హెచ్‌ 1బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత అంటూ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ట్రంప్‌ సర్కార్‌…తాజాగా లాటరీ పద్దతిన వీసాలు కేటాయించే పద్దతికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించింది.H-1b వీసాల జారీ విషయంలో కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్దతికి గుడ్ బై చెబుతూ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. దీనిస్థానంలో వేతన స్థాయి ఆధారిత వీసాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు గురువారం ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందన తెలియజేయవచ్చుని అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ(డిహెచ్‌ఎస్‌) తెలిపింది. కాగా, ఇకపై గరిష్ఠ వేతన స్థాయి వీసాల ద్వారా మెరుగైన వేతనాలను అందించేలా ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రంప్‌ సర్కార్ ప్రకటించింది.భారత్ సహా, వివిధ దేశాలనుంచి ప్రతీ ఏడాది హెచ్‌ 1బీ వీసా కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉంటాయి. వీటిలో కంప్యూటర్‌ లాటరీ ద్వారా 65 వేల మందిని ఎంపిక చేసి హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పద్దతిలో విదేశాలకు చెందిన అభ్యర్ధులు చౌకగా దొరుకుతుండడంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందంటూ ట్రంప్‌ సర్కార్‌ వాదిస్తోంది. దీనికి బదులుగా ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్‌1బీ వీసాను జారీచేసేలా చర్యలు చేపడుతోంది.

Related Tags :

Related Posts :