లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

వైట్ హౌజ్‌లో ప్రశాంతంగా ట్రంప్.. లక్షణాల్లేవ్!!

Published

on

US President Donald Trump పూర్తి రెస్ట్ లో ఉంటున్నారని White House డాక్టర్లు అంటున్నారు. మంగళవారం మిలిటరీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన ట్రంప్ వైట్ హౌజ్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటారని వైద్యులు చెప్పారు. ‘ఆ సమయంలో ట్వీట్ చేసిన ట్రంప్.. ఫీలింగ్ గ్రేట్ (గొప్పగా అనిపిస్తుంది) అని పోస్టు చేశాడు’

‘ప్రెసిడెంట్ కు సంబంధించిన ఫిజిషియన్స్ టీం అతని రెసిడెన్స్ లో కలిశారు. ఏ లక్షణాలు లేకుండానే రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయారు. ఫిజికల్ ఎగ్జామ్.. ఆరోగ్య స్థితి స్థిరంగానే ఉన్నాయి. ఆయన నార్మల్ గానే ఉండగల్గుతున్నారు’ అని వైట్ హౌజ్ ఫిజిషియన్ డా. సీన్ కాన్లే మెమొరాండంలో పేర్కొన్నారు.74ఏళ్ల ట్రంప్.. అతని భార్య మెలానియా ట్రంప్ కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు గురువారం తెలిసింది. ట్రీట్ మెంట్ కోసం ప్రెసిడెంట్ ను మిలటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. శుక్రవారం నుంచి అతనికి జ్వరం రాలేదని డాక్టర్లు చెప్పారు. ఫస్ట్ లేడీ మెలానియా హెల్త్ కండిషన్ కూడా బాగానే ఉంది.

మీడియా రిపోర్టుల ఆధారంగా.. 30మంది వైట్ హౌజ్ స్టాఫ్ తో పాటు.. ముగ్గురు జర్నలిస్టులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వాళ్లలో వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్అనీ కూడా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఎటువంటి కొవిడ్ లక్షణాలు కనిపించకపోవడంతో బుధవారం ప్రెస్ మీట్‌కు రానున్నారు.

ట్రంప్ మరో ట్వీట్‌లో.. తాను డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిట్ జో బిడెన్ తో అక్టోబర్ 15న డిబేట్ లో పాల్గొనాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘గురువారం సాయంత్రం మియామీలో డిబేట్ లో పాల్గొనాలని అనుకుంటున్నా. ఇది చాలా గొప్ప విషయం’ అని ట్రంప్ ట్వీట్ చేశాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *