H-1B వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం.. భారతీయ ఐటీ నిపుణులకు దెబ్బ!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికాలో నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసే పనిలో పడ్డారు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా సంక్షోభంతో అమెరికాలో నిరుద్యోగానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి హెచ్-1బీ వంటి వలసదారుల వీసాల మీదే ట్రంప్ ఫోకస్ పెట్టారు. ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ కార్మికులతో పాటు హెచ్-1బీ వీసా ఉన్న వారిని నియామకం నుండి కాంట్రాక్ట్ లేదా ఉప కాంట్రాక్ట్ చేయకుండా నిరోధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సోమవారం ట్రంప్ సంతకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ జాబ్ మార్కెట్ మీద కన్నేసిన భారతీయ ఐటీ నిపుణులకు తీరని దెబ్బ పడనుంది.

ఫెడరల్ ప్రభుత్వం అమెరికన్లను మాత్రమే నియమించుకొనేలా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నాను అని ట్రంప్ స్పష్టం చేశారు. దీనిపై సంతకం చేయడానికి ముందు వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం కష్టపడి పనిచేసే అమెరికన్లను తొలగించే నిర్ణయాలను తన పాలనలో సహించనని తేల్చిచెప్పారు.



అమెరికన్ ఉద్యోగాలను సృష్టించడానికి అధిక పారితోషికం తీసుకొనే నిపుణుల కోసం మాత్రమే హెచ్-1బీ వీసాలను వినియోగించాలని స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నికలకు కీలకమైన ఏడాది కావడంతో అమెరికన్ ఉద్యోగ భద్రత కోసం 2020 చివరి వరకు జూన్ 23లో హెచ్ -1 బి వీసాలతో పాటు ఇతర రకాల విదేశీ వర్క్ వీసాలను ట్రంప్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. కొత్త ఆంక్షలు జూన్ 24 నుండి అమల్లోకి వచ్చాయి.

భారతీయ ఐటి నిపుణులలో ఎక్కువగా కోరిన హెచ్ 1 బి వీసా, వలస రహిత వీసాల ద్వారా విదేశీ కార్మికులను నియమించడానికి యుఎస్ కంపెనీలను అనుమతిస్తుంది. భారతదేశం, చైనా వంటి దేశాల నుండి ప్రతి ఏడాది పదివేల మంది ఉద్యోగులను నియమించడానికి టెక్నికల్ కంపెనీలు ఈ విధానంపైనే పనిచేస్తుంటాయి. H-1B నిబంధనను ఖరారు చేస్తున్నామని, అమెరికన్ ఉద్యోగులను మరలా భర్తీ చేయకూడదని సూచించారు.



అమెరికాలో ఉద్యోగాలను సృష్టించడానికి అధిక పారితోషికం ఉన్న ప్రతిభావంతుల కోసం మాత్రమే H-1B వీసాను ఉపయోగించాలని సూచించారు. ఈ సందర్భంగా హెచ్ -1 బి వీసాలో 70 శాతం భారతదేశానికి చెందిన ప్రజలకు వెళుతుందని వైట్ హౌస్ లో ఒక అధికారి తెలిపారు. త్వరలో ఇమ్మిగ్రేషన్ బిల్లుపై చర్చించనున్నట్టు తెలిపారు ట్రంప్.. కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఈ బిల్లు అమలు చేసి తీరుతామన్నారు. మెరిట్ మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

Related Posts