లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఓటమిని పరోక్షంగా అంగీకరిస్తున్న ట్రంప్!

Published

on

trump

Trump supporters refuse to accept defeat : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెట్టుదిగుతున్నారా…? ఓటమిని అంగీకరిస్తున్నారా.. ? అవుననే అంటున్నాయి వైట్‌హౌస్‌ వర్గాలు. ఇన్నాళ్లూ తాను ఓడిపోలేదంటూ మొండిపట్టు పట్టిన ప్రెసిడెంట్‌ తాజాగా తన ఓటమిని పరోక్షంగా అంగీకరించారు ట్రంప్.. కరోనాపై వైట్‌హౌస్‌లో మాట్లాడిన ట్రంప్‌… తర్వాత వచ్చేది ఎవరి ప్రభుత్వమో ఎవరికి తెలుసంటూ వ్యాఖ్యానించారు.నిన్నటివరకూ అసలు తానే గెలిచానని… ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించారు ఆయన. కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలపై ట్రంప్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకు అమెరికాలో మరోసారి లాక్‌డౌన్‌ తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తదుపరి ప్రభుత్వం ఎవరిదనేది తెలియదంటూ ఎన్నికల్లో ఓటమి గురించి పరోక్షంగా ప్రస్తావించారు. మా ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ను తీసుకురాదు. అయితే భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చు. వచ్చేది ఏ ప్రభుత్వమో ఎవరికి తెలుసు? దానికి కాలమే సమాధానం చెబుతుంది. అని చెప్పుకొచ్చారు. ట్రంప్ మెట్టుదిగితే అధికార మార్పిడి సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ కొన్ని గంటల క్రితం ముగిసింది. అటూ ఇటూ ఊగిసలాడిన జార్జియా కూడా బైడెన్‌ ఖాతాలోకి చేరిపోయింది. దీంతో బైడెన్‌కు 306 ఓట్లు రాగా… ట్రంప్‌కు 232 ఎలక్టోరల్‌ ఓట్లు మాత్రమే వచ్చాయి. 270 మ్యాజిక్‌ ఫిగర్‌కు చాలా దూరంలో ఆగిపోవడంతో ట్రంప్‌ ఇక తనకు వేరే మార్గాలు లేవని అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ట్రంప్‌ ఓటమిని అంగీకరిస్తున్నట్లు సమాచారం. జనవరిలో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.ఈలోపే తన టీమ్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు ఇంతకాలం కొత్త అధ్యక్షుడిగా బైడెన్‌ను ట్రంప్ అంగీకరించకపోవడంతో బైడెన్‌ టీమ్‌కు ముందస్తుగా ఇవ్వాల్సిన నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు ట్రంప్ వాటిని విడుదల చేసే అవకాశం ఉంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *