లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌

Published

on

Trump, Wife Melania Test corona Positive: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. హోం క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిపారు. ముందుగా ట్రంప్‌ అడ్వైజర్ హూప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ట్రంప్ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకోవడంతో… పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తన అడ్వైజర్ తో ట్రంప్ సన్నిహితంగా మెలగడంతో వైరస్ బారినపడ్డారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌కి ఇది ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రంప్‌తో కలిసి హూప్ హిక్స్, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. హోప్ హిక్స్‌కు కరోనా వైరస్ సోకిన విషయాన్ని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ధ్రువీకరించారు. ‘ఆమె చాలా హార్డ్ వర్కర్.. ఆమె తరుచూ మాస్క్ ధరిస్తుంది.. కానీ కరోనా పాజిటివ్ వచ్చింది’ అన్నారు.  ఆమెతో చాలా సమయం గడిపాం.. ప్రథమ మహిళ కూడా పరీక్ష చేయించుకుంది అని చెప్పారు.

ఎన్నికలు దగ్గరపడ్డ వేళ ఇది ట్రంప్‌కి ఓ రకంగా గడ్డు పరిస్థితే. కీలకమైన చివరి వారాల్లో ప్రచారానికి ఆయన దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రంప్‌ దంపతులకు తొలిసారి మార్చిలో కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించారు.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో సహా ఆయన కమ్యూనికేషన్‌ చీఫ్‌ ఫాబియోతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీ జరిగిన రెండు రోజుల తర్వాత ఫాబియోకు కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా కోవిడ్ సోకిందేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అమెరికా అధ్యక్షుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అప్పుడు కూడా నెగెటివ్‌గా వచ్చింది.

ఏప్రిల్‌లో రెండోసారి పరీక్షలోనూ ట్రంప్‌ కి నెగెటివ్ వచ్చినట్టు వ్యక్తిగత వైద్యుడు కాన్‌లీ తెలిపారు. కేవలం 15 నిమిషాల్లోనే రిపోర్టు వచ్చిందని, అధ్యక్షుడికి కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ సైతం ఈ విషయం స్వయంగా ప్రకటించారు.

అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతోంది. డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ కంటే ప్ర‌చారంలో తానే ముందున్నాన‌ని  అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ సమయంలో, ట్రంప్ ప్ర‌చార హోరుకు కాస్త బ్రేక్‌ ప‌డింది. ట్రంప్ స‌ల‌హాదారు హోప్ హిక్స్, క‌రోనా బారిన ప‌డ్డారు.  ఆమె నిత్యం ట్రంప్ వెంటే ఉంటారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *