లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బైడెన్ ప్రమాణానికి ట్రంప్ డుమ్మా

Updated On - 7:25 am, Wed, 20 January 21

Trump will not attend : అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పదవి దిగిపోతున్న అధ్యక్షుడు రావడం సంప్రదాయం. అయితే.. బైడెన్ ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్లడంలేదు. ఇప్పటివరకూ అమెరికా చరిత్రలో ముగ్గురు అధ్యక్షులు మాత్రమే తదుపరి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రాకుండా ఉండిపోయారు. అయితే గత శతాబ్దంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. అయితే ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో పాటు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌, లారా బుష్‌, బిల్‌ క్లింటన్‌, హిల్లరీ క్లింటన్‌, బరాక్‌ ఒబామా, మిషెల్లి ఒబామాతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని ఫాక్స్ న్యూస్ మినహా అమెరికా ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు, స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు ప్రసారం చేయనున్నాయి.

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు (భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 10.30 గంటలు) ప్రమాణం చేయనున్నారు.
వాషింగ్టన్ లోని అమెరికా కాంగ్రెస్ భవనం క్యాపిటల్ హిల్ పశ్చిమ వైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ట్విట్టర్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ తదితర సోషల్ మీడియాల ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ తో ప్రమాణం చేయిస్తారు. ఆయన కంటే ముందుగా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణం చేయించనున్నారు.

ప్రమాణం అనంతరం బైడెన్, కమలా హారిస్ లు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. నటుడు టామ్ హ్యాంక్స్ నేతృత్వంలో రాత్రి 8.30 గంటలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది.
ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జెన్నిఫర్ లోపెజ్, గార్త్ బ్రూక్స్ ల ప్రదర్శనలు ఉంటాయి.
బైడెన్ ప్రమాణం సందర్భంగా…భద్రతా సిబ్బంది నుంచి దాడి జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో క్యాపిటల్ హిల్ వద్ద 25 వేల మంది నేషనల్ గార్డ్స్ సిబ్బందిని మోహరించారు.