లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఇకపై ట్రంప్ ఉండేది ఇక్కడే

Published

on

Trump’s Mar-a-Lago residence in Florida అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఇవాళ రాత్రి 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్‌ ట్రంప్‌..కుటుంబసమేతంగా శ్వేతసౌధాన్ని వీడారు. అధ్యక్ష హోదాలో చివరిసారిగా మెరైన్ వన్ హెలికాప్టర్​​ ఎక్కి.. ఫ్లోరిడాలోని తన శాశ్వత నివాసానికి బయలుదేరారు. ​ఇప్పటికే శ్వేతసౌధంలోని ఆయన సామగ్రిని ఫ్లోరిడా పామ్​ బీచ్​లో ఉన్న ‘మార్​-ఏ-లాగు’ ఎస్టేట్​కు తరలించారు.

శీతాకాల వైట్​హౌస్​గా పిలిచే మార్​-ఏ-లాగు ఎస్టేట్​లో ట్రంప్​ అధికారం చేపట్టిన నాటి నుంచి ఎక్కువ కాలం గడిపారు. 2019 తర్వాత ట్రంప్​ తన అధికారం నివాసంగా కూడా మార్​-ఏ-లాగు ను మార్చారు. సుమారు 20 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ ఎస్టేట్​లో 128 గదులు ఉన్నాయి. 5 టెన్నిస్​ కోర్టులు, 20 వేల చదరపు అడుగుల్లో ఫుట్​బాల్​ రూం, వాటర్ ​ఫ్రంట్​ రూం లాంటి అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఇది ప్రస్తుతం ప్రైవేట్​ క్లబ్​గా ఉండగా.. ట్రంప్​కు మాత్రం ఇందులో ప్రత్యేక వసతి గదులు ఉన్నాయి. మార్కెట్​ అంచనా ప్రకారం దీని విలువ సుమారు రూ. 12 వేల కోట్ల వరకు ఉంటుంది.

వాషింగ్టన్​ వీడే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితులు, మద్దతుదారులు తన సిబ్బందికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాలు అద్భుతమైనవి. మనమంతా కలిసికట్టుగా చాలా సాధించాం. మీ ప్రయత్నాలకు నా కృతజ్ఞతలు. ఈ కుటుంబం ఎంత కష్టపడి పనిచేసిందో ప్రజలకు తెలియదు అని అన్నారు. కరోనా సమయంలోనూ సమర్థవంతంగా పనిచేశామన్నారు. తొమ్మిది నెలల్లోనే కరోనా వ్యాక్సిన్ ను తీసుకొచ్చామన్నారు. సంక్షోభ సమయంలోనూ ఆర్థిక వృద్ధి సాధించామన్నారు. అమెరికన్ల హక్కుల కోసం పోరాటం చేశామన్నారు. తాను ఎప్పుడూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. త్వరలో కొత్త ఫోరంలో కులుద్దాం అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు. అయితే, తన ప్రసంగంలో కొత్త అధ్యక్షుడిగా మరికొద్ది గంటల్లో బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ పేరుని ట్రంప్ ప్రస్తావించలేదు..కానీ కొత్త ప్రభుత్వానికి మంచి అదృష్టం, విజయం చేకూరాలని విష్ చేశారు.