రాష్ట్రంలో త్వరలో ఆన్ లైన్ లో జాబ్ మేళాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డీట్ అనే వెబ్ సైట్ ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేస్తున్న ఆ శాఖ త్వరలో కార్పోరేట్ యాజమాన్యాలతో సమావేశం కానుంది. ఆయా కంపెనీల్లో చిన్న ఉద్యోగాల ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీచేయనున్నారు. వీటి భర్తీకి జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్సెంజ్ లు కీలకపాత్ర పోషించనున్నాయి.గ్రామీణ యువత కోసం ప్రత్యేక ప్రణాళిక
ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను గ్రామీణ యువత అందిపుచ్చుకునేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదించి ఉద్యోగ ఖాళీల భర్తీపై చర్చలు జరిపింది. ఇందులో భాగంగా డీట్‌ వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టిన అధికారులు..తాజాగా నేరుగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హతలేమిటి…అభ్యర్థుల నియామకం ఎలా చేపట్టాలనే దానిపై కంపెనీల వారీగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.ఆన్ లైన్ లో జాబ్ మేళాలు
గతంలో జిల్లాల్లోని ఎంప్లాయ్ మెంట్ ఎక్సెంజీల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించినప్పటికీ వాటిలో కొన్ని కంపెనీలు మాత్రమే పాల్గోనేవి. ఇప్పుడలా కాకుండా కంపెనీల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి వాటిని కేటగిరీల వారీగా విభజించి ఆ మేరకు ఒక్కో కేటగిరీని భర్తీ చేస్తారు. అభ్యర్ధులు వారి ఆసక్తిని బట్టి కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు.కంపెనీలలో ఉన్న ఖాళీలను సేకరించి వాటిని ఆన్ లైన్ లో పొందుపరుస్తారు. ఆన్‌లైన్‌ పద్దతిలోనే జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజ్‌ ద్వారా జాబ్‌ మేళా నిర్వహించి భర్తీ చేస్తారు. కోవిడ్‌–19 తీవ్రత తగ్గిన తర్వాత అప్పటి పరిస్థితులకు తగినట్లు జాబ్‌మేళాలు నిర్వహించనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులు వివరించారు.


Related Posts