The TS government will file another affidavit in the High Court

అప్పుల ఊబిలో ఆర్టీసీ : హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనున్న ప్రభుత్వం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్టీసీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించనుంది.

ఆర్టీసీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనుంది. సోమవారం (నవంబర్ 11, 2019) ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వం కోర్టుకు సమర్పించనుంది. ఆర్టీసీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీసీ మొత్తం బకాయిలు రూ.2209.66 కోట్లుగా ప్రభుత్వం లెక్క చూపుతోంది. 

అందులో పీఎఫ్ బకాయిలు రూ.788.30 కోట్లు, క్రెడిట్ కో-ఆరేటివ్ సొసైటీ బకాయిలు రూ.500.95 కోట్లు, మోటారు వెహికల్ యాక్టు ప్రకారం 2017 నుంచి 2019 వరకు రూ.452.36కోట్లు బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిలు 2014 నుంచి 2018 వరకు రూ.180 కోట్లు, రిటైర్డ్ ఎంప్లాయిస్ సెటిల్ మెంట్స్ బకాయిలు రూ.52 కోట్లు ఉన్నట్లు లెక్క తేల్చింది.

2వేల ప్రైవేట్ బస్సులకు సంబంధించి రూ.25 వేల కోట్లు చెల్లించాల్సివుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులకు మరమ్మతులకు సంబంధించి రూ.60 కోట్లు చెల్లించాల్సివుంది. ఆర్టీసీ అప్పులు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై స్పష్టంగా నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను రేపు కోర్టులో సమర్పించనున్నారు. ఇప్పటికే హైకోర్టులో పలు అఫిడవిట్లు దాఖలు చేసినప్పటికి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు వ్యాఖ్యానించ లేదు.

ఈక్రమంలో కూలంకుషంగా పూర్తిస్థాయి నివేదికను సైతం తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆర్టీసీకి సంబంధించి అప్పులు ఏ విధంగా ఉన్నాయి… తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి ఏ విధంగా ఉంది…కేవలం 47 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని గతంలో హైకోర్టు వ్యాఖ్యానించింది. 

తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుంది. పూర్తిస్థాయిలో ఆర్టీసీ ఆర్థిక స్థితిని కోల్పోయిందన్న అంశాలపై నివేదికను సైతం అధికారులు సిద్ధం చేశారు. కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారనేది కోర్టుకు సవివరంగా వివరించనున్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ లేదా ఈడీలతో కూడిన కమిటీ కార్మికులతో చర్చలు జరిపిన సందర్భంగా వారు వ్యవహరించిన తీరును కోర్టుకు వివరించనున్నారు. ముగ్గురు ఐఏఎస్ లతో కమిటీ వేసి కార్మికులతో చర్చలు జరిపినా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను కార్మికులు బలంగా వినిపిస్తూ..దాన్ని ప్రతిసారి ముందుకు తీసుకొస్తూ బెట్టు వీడని పరిస్థితిని కోర్టుకు తెలియజేయనున్నారు.  

ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ తీసుకున్న చర్యలు, సమ్మె వల్ల నష్టాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కోర్టు వెల్లడించనున్నారు. హైకోర్టు సూచన మేరకు ఈడీల ఆధ్వర్యంలో కమిటీ వేసి కార్మికులతో చర్చించారు. 21 అంశాలపై చర్చించాలని కోర్టు సూచించిన మేరకు జరిపిన చర్చల్లో కార్మికులు ఏ విధంగా వ్యవహరించారన్న దాంతో పాటు ముఖ్యంగా 15 ప్రధాన అంశాలపై పూర్తి స్థాయి వివరణతో ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది.
 

READ  బీ అలర్ట్ : స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది

Related Posts