Home » దీపావళి సెలబ్రేషన్ వద్దు : భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ
Published
1 year agoon
By
madhuఅక్టోబర్ 27న దీపావళి పండుగ చేసుకోమని అక్టోబర్ 22వ తేదీన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ములాఖత్ నిర్వహిస్తామన్నారు అశ్వత్థామరెడ్డి. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 20వ తేదీ ఆదివారానికి సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెపై అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు మెట్టు వీడకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది.
దీనిపై హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వమే ఆహ్వానించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకోవాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తోంది. భవిష్యత్ కార్యచరణనను ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ. అక్టోబర్ 20వ తేదీ ఆదివారం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.
అక్టోబర్ 21వ తేదీ సోమవారం అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో ధర్నాలు చేస్తామన్నారు. 24న మహిళా కండక్టర్లు ధర్నా నిర్వహిస్తారని, 25న రాస్తారోకోలు, రహదారుల దిగ్బందం, 26న కార్మికుల పిల్లలు ధర్నా ఉంటుందన్నారు. అక్టోబర్ 30న 5 లక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని వెల్లడించారు.
మరోవైపు ఎస్వీకేలో అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ అయ్యారు. తమ్మినేని, ఎల్.రమణ, కోదండరాం, వీహెచ్, చాడ వెంకట్ రెడ్డిలు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
Read More : రూ.వెయ్యి ఫైన్, కేసు నమోదు: హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్