tsrtc strike, dead line to end

ఏం జరగనుంది : కొన్ని గంటల్లో ముగియనున్న డెడ్ లైన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్టీసీ కార్మికులకు.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది. సమ్మె విరమించి విధుల్లో చేరతారా లేక పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై సస్పెన్స్

ఆర్టీసీ కార్మికులకు.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది. సమ్మె విరమించి విధుల్లో చేరతారా లేక పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కార్మికులు విధుల్లో చేరకపోతే ప్రభుత్వం డెడ్ లైన్ పొడిగిస్తుందా, లేక మొత్తం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

మంగళవారం(నవంబర్ 5) అర్ధరాత్రి లోపు.. కార్మికులు విధుల్లో చేరకపోతే ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడా కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. ఒకరిద్దరు విధుల్లో చేరాక మళ్లీ సమ్మెలోకి వచ్చారు. మిగతావారు కూడా సమ్మెను విరమించి విధుల్లో చేరతారా, లేక జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అన్న దానిపై సస్పెన్స్ ఉంది.

ముఖ్యమంత్రి డెడ్ లైన్ విధించినా ఎవరూ విధుల్లో చేరలేదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి. ఆదివారం(నవంబర్ 3,2019) డ్యూటీలో చేరిన 11 మందిలో..  ఐదుగురు తిరిగి సమ్మెలో చేరారని చెప్పారు. ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించాలని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉంటే.. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం మరోసారి అల్టిమేటం జారీ చేసింది. మంగళవారం(నవంబర్ 5,2019) అర్థరాత్రిలోగా విధుల్లో చేరకపోతే ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోబోమంటూ సంకేతాలిచ్చారు సీఎం కేసీఆర్‌. మిగిలిన 5 వేల రూట్లలోనూ ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అదే జరిగితే తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని కామెంట్ చేశారు‌. 5వ తేదీ అర్థరాత్రి లోపు విధుల్లో చేరిన వాళ్లని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సోమవారం(నవంబర్ 4,2019) సమీక్ష నిర్వహించారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ హాజరయ్యారు. ఇప్పటివరకు ఎంతమంది విధుల్లో చేరారనే విషయంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు.

Related Posts