Home » ఆర్టీసీ సమ్మె విరమణ : ప్రభుత్వ ప్రకటనపై ఉత్కంఠ
Published
1 year agoon
By
madhuసమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో..ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ ప్రకటనపై కార్మికులు ఎదురు చూస్తున్నారు. 2019, నవంబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. 52 రోజుల పాటు విధులకు దూరంగా ఉన్నారు. దసరా పండుగ నేపథ్యంలో సమ్మెలోకి వెళ్లడంపై టి.సర్కార్ తీవ్రంగా పరిగణించింది. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగం చేసింది. తాత్కాలికంగా డ్రైవర్లను, కండక్టర్లను నియమించి బస్సులను నడిపించే ప్రయత్నం చేసింది. త్రిసభ్య కమిటీ వేసి..చర్చలు జరిపినా..అవి విఫలమయ్యాయి. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అన్ని అంశాలను చర్చించి ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకబోతున్నారని తెలుస్తోంది.
5వేల 100 రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయం ఆమోదం తెలిపింది. దీనికి అనుకూలంగా హైకోర్టు వెలువరించిన తీర్పు కాపీ 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం ప్రభుత్వానికి అందనుంది. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.
> 2019, అక్టోబర్ 04వ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెల్లోకి వెళ్లారు.
> ఆర్టీసీ సమ్మె విరమణ : ప్రభుత్వం ప్రకటనపై ఉత్కంఠ52 రోజుల పాటు విధుల బహిష్కరణ.
> చర్చల కోసం త్రిసభ్య కమిటీని నియామకం.
> కమిటీతో ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం.
> ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, 25కి పైగా డిమాండ్లు పరిష్కరించాలని కార్మికుల డిమాండ్.
> దశల వారీగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు కార్మికులు.
> ప్రభుత్వం వెంటనే ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది.
> దసరా పండుగ ఉండగా..సమ్మెలోకి వెళ్లడంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు.
> హైకోర్టు సూచన మేరకు చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం రూట్లను ప్రైవేటీకరణకు టి.సర్కార్ నిర్ణయం.
> ప్రభుత్వ వైఖరితో కార్మికుల బలవన్మరణం. మరికొందరికి గుండెపోటుతో మృతి.
> నవంబర్ 25వ తేదీ సోమవారం గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ. ఆర్టీసీ సమ్మెపైనే ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం.
మొత్తంగా 52 రోజుల పాటు కొనసాగిన సమ్మె…తెరపడినట్లైంది. బేషరతుగా విధుల్లో చేరాలని కోరినా..కార్మికులు అప్పట్లో స్పందించలేదు. ఇప్పుడు సమ్మె విరమణ ప్రకటించి..విధుల్లో చేరుతామని ప్రకటించడం..ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది. 50 శాతం ప్రైవేటుకు అప్పగించాలని, మిగతా 50 శాతం ఆర్టీసీ నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా ఆర్టీసీ జేఏసీ నిర్ణయంతో కార్మికులకు షరతులు పెడుతుందా ? అనేది చూడాలి.