TSRTC temporary drivers and conductors Regularise

ఆర్టీసీలో తాత్కాలిక సిబ్బంది రెగ్యులరైజ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీఎస్ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీలోని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులరైజ్ చేసింది.

టీఎస్ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీలోని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులరైజ్ చేసింది. 296 మంది డ్రైవర్లు, 63 మంది కండక్టర్లను ఆర్టీసీ యాజమాన్యం రెగ్యులరైజ్ చేసింది. ఆర్టీసీలో 240 రోజులు తాత్కాలికంగా విధులు నిర్వర్తించిన డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులరైజ్‌ చేస్తూ శనివారం (డిసెంబర్ 7, 2019) ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయం పట్ల రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులు ఆర్టీసీ యాజమాన్యానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు సీఎంకు రుణపడి ఉంటామని తెలిపారు. సమ్మె కాలంలో తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వర్తించారు. 50 రోజులకు పైగా సమ్మె కొనసాగింది. ఆ సమయంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో పాల్గొన్నారు.

ఆర్టీసీ సమ్మె అనంతరం సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ఒక్కో హామీ నెరవేరుతోంది. ముందుగా సమ్మె కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలకు సంబంధించి సెప్టెంబర్‌ నెల జీతాలను విడుదల చేసిన ప్రభుత్వం. ఇప్పుడు తాత్కాలిక సిబ్బందిని రెగ్యులరైజ్ చేసింది. 
 

Related Posts