TTD Council is a key decision on the sale of assets

ఆస్తుల అమ్మకంపై TTD పాలక మండలి కీలక నిర్ణయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తిరుమలలో TTD పాలక మండలి కాసేపటి క్రితం ముగిసింది. టీటీడీ నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒక్క సారి సమావేశం నిర్వహించాల్సి ఉండడంతో… లాక్‌డౌన్ ఉన్నప్పటికీ పాలకమండలి సమావేశం కాబోతోంది. అయితే… చరిత్రలో మొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2020, మే 28వ తేదీ గురువారం ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో 60 అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా స్వామివారి ఆస్తుల విక్రయాలపై టీటీడీ నిర్ణయాన్ని ప్రకటించింది.

టీటీడీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి…మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తమపై దుష్ర్పచారం జరిపేందుకు కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు ప్రయత్నించాయని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా సైలెంట్ గా ఉండి..తమ బోర్డులో సమీక్షించిన తర్వాత..అమ్మకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా…ప్రభుత్వంపై, తమ పాలక మండలిపై విస్తృతమైన ప్రచారం జరిగిందన్నారు. సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 

గత కొన్ని రోజులుగా టీటీడీ ఆస్తుల వేలం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై, పాలక మండలిపై దుమ్మెత్తిపోశాయి. ఈ క్రమంలోనే పాలక మండలి సమావేశం జరగడం అత్యంత ప్రాధాన్యత సంతరించకుంది. ఎలాంటి నిర్ణయం వెలువడనుందనే దానిపై ఉత్కంఠ నెలకొనేది. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా..తమపై దుష్ర్పచారం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలను కాపాడేందుకు కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 20 కోట్లు కేటాయించింది. టీటీడీ విద్యా సంస్థల్లో ఉద్యోగుల పిల్లలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 8 ఆలయాలను దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

Read: Onlineలో లడ్డూలు : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా TTD పాలకమండలి మీటింగ్

Related Posts