లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

91 గంటలుగా భూకంప శిథిలాల కిందే నాలుగేళ్ల బాలిక..రక్షించిన రెస్క్యూ సిబ్బంది

Published

on

Turkey earthquake : టర్కీలో భూకంపం సంభవించి నాలుగు రోజులు కావస్తోంది. ఈ ప్రకృతి విధ్వంసంల మృతుల సంఖ్యల దాదాపు 100కు చేరింది. కానీ ఇంకా శిథిలాల కింత ఎవరన్నా సజీవంగా ఉన్నారా? అని రెస్క్యూ సిబ్బంది గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో వారి అంచనాలనునిజంగా చేస్తూ నాలుగేళ్ల చిన్నారి భూకంప శిథిలాల కింద సజీవం కనిపించటంతో ఆ పాపను సిబ్బంది అతి జాగ్రత్తగా రక్షించింది.


నాలుగు రోజుల క్రితం ట‌ర్కీలోని ఇజ్మీర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభ‌వించిన విష‌యం తెలిసిందే. ఆ భూకంప ధాటికి ఆ ప్రాంతంలోని పలు బిల్డింగ్‌లు నేల‌మ‌ట్టం అయ్యాయి. అయితే బిల్డింగ్‌ల శిథిలాల కింద ఓ నాలుగేళ్ల బాలిక‌ ప్రాణాల‌తో స‌జీవంగా ఉంది. అయిదా గెజ్‌గిన్ అనే నాలుగేళ్ల చిన్నారిని రెస్క్యూ సిబ్బంది మంగళవారం (నవంబర్ 3,2020) సురక్షితంగాకాపాడింది.గ్రీస్, టర్కీలో భారీ భూకంపం : విరుచుకుపడిన సునామీ!


బిల్డింగ్ కూలిన 91 గంటల త‌ర్వాత ఆ చిన్నారిని శిథిలాల కింద నుంచి ర‌క్షించ‌డం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఆహారపానీయాలు లేకుండా ఆ పాప బ్రతికే శిథిలాల కింద ఉండటం నిజంగా అద్భతమనే చెప్పాలి.ఇజ్మీర్‌లోని బైరాక్లి జిల్లాలో వ‌చ్చిన 7.0 తీవ్ర‌త భూకంపం వ‌ల్ల అక్క‌డ బిల్డింగ్‌లు నేలమట్టమయ్యాయి. పశ్చిమ టర్కీలో సంభవించిన భూకంపానికి మృతుల సంఖ్య మంగళవారం నాటికి 100 పెరిగిందని టర్కీ విపత్తు అథారిటీ తెలిపింది. 7.0 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన ప్రకంపనలకు 994 మంది గాయపడ్డారని టర్కీకి ఏజెన్సీ తెలిపింది.ఇజ్మీర్‌ ప్రావిన్స్‌లోని రెస్క్యూ సిబ్బంది జాడలేకుండా పోయిన వ్యక్తుల కోసం ఐదు భవనాల్లో ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అలా కొనసాగుతున్న గాలింపులో భాగంగా శిథిలాల నుంచి ఇద్దరు బాలికలను రక్షించారు. అక్టోబ‌ర్ 30న టర్కీలో భారీ భూకంపం సంభ‌వించింది.దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.0గా న‌మోద‌య్యింది. దీంతో ట‌ర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్‌ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో సామోస్‌, ఏజియ‌న్ స‌ముద్రంలో చిన్నపాటి సమావేశం సునామీ వ‌చ్చింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *