లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

కుక్కకు బంగారు విగ్రహం చేయించి..రాజధానిలో ఆవిష్కరించిన దేశాధ్యక్షుడు

Published

on

Turkmenistan President dog golden statue : అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు..కుక్కల్ని సింహాసనం మీద కూడా కూర్చోపెట్టవచ్చు. మరీ అంతకాదుగానీ తనకు ఇష్టమైన కుక్కకు ఏకంగా బంగారంతో విగ్రహం చేయించి దాన్ని రాజధాని వీధుల్లో ప్రదర్శించిన ఘతన మాత్రం ఓ దేశాధ్యక్షుడికే చెల్లింది.

కుక్కేంటీ..బంగారం విగ్రహమేంటీ అని చెప్పుకునే ముందు.. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా ఉంది టర్క్ మెనిస్థాన్ దేశాధ్యక్షుడు గుర్బంగులీ బెర్డిముఖమెదోవ్ చేసిన పని. అధికారం అలా అనిపిస్తుందేమో. గుర్బంగులీ బెర్డిముఖమెదోవ్ కు కుక్కలంటే చాలా ఇష్టం.అరుదైన అలబాయ్ జాతి కుక్కలంటే మరీ మరీ ఇష్టం. ఆ ఇష్టం ఏ రేంజ్ లో ఉందంటే..అలబాయ్ జాతికి చెందిన కుక్కకు బంగారంతో విగ్రహం చేయించి..దాన్ని దేశ రాజధాని యాష్గబట్ లో ప్రతిష్టించేంత రేంజ్ లో ఉంది.గుర్బంగులీ బెర్డిముఖమెదోవ్ కు శునకప్రేమికుడు అని ముందే చెప్పుకున్నాం కదూ..ప్రాణంకంటే ఎక్కువగా కుక్కల్ని ప్రేమిస్తాడాయన. మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన అరుదైన అలబాయ్ జాతి కుక్కలంటే మరీ మరీ ఇష్టపడతారు.

Golden dog statu
అందుకే ఆ కుక్క జాతి గుర్తుగా బంగారు విగ్రహం చేయించారు. ఆ బంగారు కుక్క విగ్రహాన్ని దేశ రాజధాని యాష్గబట్ లో ఓ ప్రసిద్ధ కూడలిలో ఆ అలబాయ్ కుక్క స్వర్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు గుర్బంగులీ విగ్రహావిష్కరణ చేసి ఆ జాగిలం పట్ల తన అత్యంత ఇష్టాన్ని చాటిచెప్పారు. ఆ బంగారు కుక్క విగ్రహం కింది భాగంలో ఓ ఎలక్ట్రానిక్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. దానిపై అలబాయ్ జాతి కుక్కలకు చెందిన వీడియోలు ఏర్పాటు చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *