tv-actress-sravani-case-producer-ashok-reddy-ran-away

టీవీ నటి శ్రావణి కేసులో బిగ్ ట్విస్ట్, పరారీలో RX100 నిర్మాత అశోక్ రెడ్డి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఇవాళ(సెప్టెంబర్ 14,2020) విచారణకు హాజరుకావాల్సి ఉన్న ఆర్ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్ల తెలుస్తోంది. ఉదయం నుంచి అశోక్‌రెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో ఉందని పోలీసులు తెలిపారు.

శ్రావణి కేసులో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రావణి ఆత్మహత్యకు కారణం అంటూ సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిర్మాత అశోక్ రెడ్డిని ఇవాళ విచారించాల్సి ఉంది. ఇంతలోనే ఆయన ఎస్కేప్ అయ్యారు. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది.

సోమవారం ఉదయం నుంచి అశోక్ రెడ్డి ఫోన్ స్విచ్చాఫ్ లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. శ్రావణితో నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి లీక్ అయిన విషయం తెలిసిందే. దేవరాజ్ వ్యవహారంలో శ్రావణికి అశోక్ రెడ్డి సలహాలు ఇచ్చినట్టు ఆ సంభాషణను బట్టి తెలిసింది.

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసుల కొన్ని రోజులుగా శ్రావణి కేసుని విచారిస్తున్నారు. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించారు. అలాగే శ్రావణి తల్లిదండ్రుల స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.

దేవరాజ్ వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణం అని శ్రావణి తల్లిదండ్రులు, సాయికృష్ణారెడ్డి ఆరోపించారు. శ్రావణి తల్లిదండ్రులు, సాయికృష్ణారెడ్డి వేధింపుల వల్లే శ్రావణి చనిపోయిందని దేవరాజ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.

పెళ్ళికి నో అన్న దేవరాజ్…శ్రావణి సూసైడ్


కేసు నుంచి తప్పించుకోవడానికే దేవరాజ్ శ్రావణిని బుట్టలో వేసుకున్నాడని సాయి చెబుతున్నాడు. సాయి వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణం అంటున్నాడు. కాగా, ఈ కేసులో సోమవారం నిర్మాత అశోక్ రెడ్డి విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఆయనను విచారిస్తే కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు భావించారు. కానీ, సీన్ కట్ చేస్తే అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారనే వార్త బయటకు వచ్చింది.

సీరియల్ నటి శ్రావణి సూసైడ్‌ కేసు పూటకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్‌ల పర్వం మొదలైంది. శ్రావణి చావుకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌, సాయిలను ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆడియో టేపులతో ఎవరి వాదన వారే వినిపించిన ఆ ఇద్దరూ.. పోలీసుల్ని గందరగోళానికి గురిచేశారు. పోలీసులు మాత్రం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని డిసైడ్ అయ్యారు.

ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌, సాయికృష్ణను పోలీసులు విచారించారు. ఇవాళ సినీ నిర్మాత అశోక్‌రెడ్డిని విచారించాల్సి ఉంది. విచారణకు హాజరుకావాల్సిందిగా నిన్ననే ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణ అనంతరం అశోక్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతలో అశోక్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. ఆయన పరారీలో ఉన్నారు.


boy dies after eating biscuit in kurnool district

READ  నటి శ్రావణి కేసు.. నేడు కీలక విచారణ, పోలీసుల ముందుకు సాయి, RX100 నిర్మాత

అశోక్‌రెడ్డి.. శ్రావణిని బెదిరించినట్టు దేవరాజ్‌ ఆరోపిస్తున్నాడు. అశోక్‌రెడ్డితో శ్రావణిని సహజీవనం చేసేలా సాయికృష్ణ ఆమెను వేధింపులకు గురిచేశాడని పోలీసులకు చెప్పాడు. సాయి, అశోక్‌రెడ్డి కలిసి శ్రావణిని కొట్టినట్టు కూడా ఆరోపించాడు. అశోక్‌రెడ్డి శ్రావణిపై బెదిరింపులకు పాల్పడిన ఆడియోను పోలీసులకు అందజేశాడు. దీంతో పోలీసులు అశోక్‌రెడ్డిని కూడా ప్రశ్నించాలని డిసైడ్‌ అయ్యారు. అశోక్‌ను ప్రశ్నించేందుకు రెడీ అయ్యారు.

ఇటు అరెస్ట్ అయిన సాయి, దేవరాజ్‌ల ఎంక్వైరీలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేవరాజ్ పై గతంలో శ్రావణి కంప్లయింట్ ఇచ్చిందని.. ఆ కేసు నుంచి బయటపడేందుకు దేవరాజ్‌ మరోసారి శ్రావణిని ట్రాప్ చేశాడని సాయి ఆరోపించాడు. మరోవైపు కేసు ఫిర్యాదు తరువాత తనను కలవాలని శ్రావణి చాలా సార్లు ఫోన్ చేసిందని పోలీసులకు దేవరాజ్ చెప్పాడు. శ్రావణికి నేనంటే చాలా ఇష్టమని అందుకే కాల్స్‌ చేసిందని.. ఆ కాల్స్‌కి సంబంధించిన ఆడియో టేపుల్ని అందించాడు. ఆగస్ట్‌లో శ్రావణి స్వయంగా తన తల్లికి ఫోన్‌ చేసి పెళ్లి ప్రపోజల్ చేసిందన్నాడు దేవరాజ్‌.


boy dies after eating biscuit in kurnool district

దేవరాజ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని… అతనితో తన వివాహం జరిపించాలని దేవరాజ్‌ తల్లి సత్యవతికి కాల్ చేసి వేడుకుంది శ్రావణి. కట్నకానుకలతోపాటు పెళ్లి ఖర్చంతా తానే భరిస్తానని కూడా చెప్పింది. ఈ సందర్భంగా సత్యవతి, దేవరాజ్‌పై పెట్టిన కేసు గురించి ప్రశ్నించింది. కేసును ఉపసంహరించుకోవాలని కోరింది. పోలీసుల విచారణలో ఈ ఆడియో కూడా కీలక కానుంది.

మరోవైపు పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఆడియోలతో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. సాయితో పాటు శ్రావణి కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేసిన పోలీసులు.. మరో 10మందిని కూడా ప్రశ్నించారు. మరోవైపు ఆర్‌ ఎక్స్‌ 100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి, శ్రావణి మధ్య ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి శ్రావణి సూసైడ్ కేసు కొత్త కోణాలు.. విస్తుపోయే నిజాలతో సస్పెన్స్‌ సీరియల్‌ను తలపిస్తోంది.


boy dies after eating biscuit in kurnool district

Related Posts