"Twin Murder": Anger In Tamil Nadu After Man, Son Die In Police Custody

రూల్స్ పట్టించుకోలేదని తండ్రీకొడుకుల్ని పోలీసులే చంపేశారా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిబంధనలు అతిక్రమించి అనుమతులు లేని సమయంలోనూ షాప్ ఓపెన్ చేశారని తండ్రీ  కొడుకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి వారు చనిపోయారంటూ డెడ్ బాడీస్ ను కుటుంబానికి అప్పజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో యావత్ తమిళ రాష్ట్రం షాక్ అయింది. పోలీసులు వారిని జైల్లో టార్చర్ పెట్టి మరణానికి కారణం అయ్యారంటూ దానికి నిరసనగా ఒకరోజంతా షాపులు మూసి ఉంచాలని వ్యాపారవేత్తలు నిర్ణయించుకున్నారు. 

జయరాజ్ అతని కొడుకు మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారిద్దరి శరీరాలపై గుర్తులు టార్చర్ అనుభవించినట్లు స్పష్టం చేస్తున్నాయి. అందులో భాగమైన పోలీసులపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

‘ఇవి జంట హత్యలు. వర్ణించలేనంతగా వారిని టార్చర్ పెట్టారు. ఓ మహిళగా అవెలా ఉన్నాయో నేను చెప్పలేను. దీనికి కారణమైన పోలీసులపై మర్డర్ కేసు పెట్టేంత వరకూ ఆ డెడ్ బాడీలను తీసుకోమని జయరాజ్ కూతురు పెర్సిస్ వాదిస్తుంది. శాంతన్కులంలో జయరాజ్ అతని కొడుకు కలిసి మొబైల్ ఫోన్ స్టోర్ నడిపిస్తున్నారు. వారిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 

ఎఫ్ఐఆర్ లో నమోదైన సమాచారం ప్రకారం.. ఇద్దరినీ నేలపై పొర్లించారని అందుకే వారికి ఇంటర్నల్ గా గాయాలైనట్లు పేర్కొన్నారు. వారికి పోలీసులకు మధ్య వాగ్వాదాలు జరిగాయని దూషించుకున్నట్లు పలువురు అంటున్నారు. మెజిస్ట్రేట్ లో రెండో రోజు హాజరుపరిచారని దాని కంటే ముందు రాత్రి వారిని స్టేషన్లో ఉంచుకుని విపరీతంగా టార్చర్ పెట్టారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

సబ్ జైలులో పెన్నిస్ చాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో అతణ్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగానే చనిపోయాడు. అతని తండ్రి జ్వరం వస్తుందని చెప్పగా హాస్పిటల్ కు తీసుకెళ్లేసరికి చనిపోయాడని పోలీస్ చీఫ్ అరుణ్ బాలగోపాలన్ అన్నాడు. మద్రాస్ హై కోర్టు ముగ్గురు డాక్డర్లతో కలిసి పోస్టు మార్ట నిర్వహించాలని దానిని వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది. 

ముఖ్యమంత్రి పలానిస్వామి వారిద్దరి కుటుంబాలకు చెరో రూ.20లక్షలు మంజూరు చేయడంతో పాటు చెరొక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. పోలీస్ టార్చర్ జరిగిందని హైకోర్టు తీర్పు ఇస్తే ఆదేశాలను పాటిస్తాం. మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాం. అని అన్నారు. 

Read: ప్రపంచంలో సగం మందికి ఆక్సిజన్ కరవు..కరోనా కాలంలో పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు

Related Tags :

Related Posts :